Share News

Harvard University: ట్రంప్ సర్కారుకు ఎదురుదెబ్బ.. హార్వర్డ్ వర్శిటీకి ఉపశమనం

ABN , Publish Date - May 23 , 2025 | 10:07 PM

అమెరికాలోని ప్రతిష్ఠాత్మక హార్వర్డ్‌ విశ్వవిద్యాలయానికి అమెరికా కోర్టు నుంచి ఉపశమనం లభించింది. వర్సిటీలో విదేశీ విద్యార్థులను చేర్చుకోవడానికి ఉన్న అనుమతిని రద్దు చేసినట్లు ట్రంప్ ప్రభుత్వం చేసిన ఆదేశంపై అమెరికా కోర్టు స్టే విధించింది.

Harvard University: ట్రంప్ సర్కారుకు ఎదురుదెబ్బ.. హార్వర్డ్ వర్శిటీకి ఉపశమనం
Harvard University

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలోని ప్రతిష్ఠాత్మక హార్వర్డ్‌ విశ్వవిద్యాలయానికి అమెరికా కోర్టు నుంచి ఉపశమనం లభించింది. వర్సిటీలో విదేశీ విద్యార్థులను చేర్చుకోవడానికి ఉన్న అనుమతిని రద్దు చేసినట్లు ట్రంప్ ప్రభుత్వం చేసిన ఆదేశంపై అమెరికా కోర్టు స్టే విధించింది. హార్వర్డ్ యూనివర్శిటీలో విదేశీ విద్యార్థుల ప్రవేశ హక్కులను రద్దు చేయాలన్న ట్రంప్ ప్రభుత్వ చర్యను అమెరికా న్యాయమూర్తి అడ్డుకున్నారు. కాగా, తమ యూనివర్శిటీపై విధించిన చర్యల్ని ఆపాలంటూ హార్వర్డ్ వర్శిటీ బోస్టన్‌లోని ఫెడరల్ కోర్టులో ఫిర్యాదు దాఖలు చేసింది.

అమెరికా ప్రభుత్వ తాజా చర్య అమెరికా రాజ్యాంగం, ఇతర సమాఖ్య చట్టాల "స్పష్టమైన ఉల్లంఘన"గా అభివర్ణించింది. ఇది విశ్వవిద్యాలయం, ఇంకా అందులో చదువుతున్న 7,000 మందికి పైగా వీసా హోల్డర్లపై "తక్షణ వినాశకరమైన ప్రభావాన్ని" చూపుతుందని కోర్టుకు విన్నవించింది. ఒక్క పెన్ను పోటుతో ప్రభుత్వం హార్వర్డ్ విద్యార్ధుల్లో పావు వంతును, విశ్వవిద్యాలయం, దాని మిషన్‌కు గణనీయంగా దోహదపడే అంతర్జాతీయ విద్యార్థులను తుడిచిపెట్టడానికి ప్రయత్నించింది" అని హార్వర్డ్ తన పిటీషన్‌లో వాదించింది. అంతేకాదు, "అంతర్జాతీయ విద్యార్థులు లేకుండా హార్వర్డ్.. హార్వర్డ్ కాదు" అని కోర్టుకు తెలియచెప్పింది. దీనిని పరిగణలోకి తీసుకున్న ఫెడరల్ కోర్టు ట్రంప్ ఉత్తర్వులపై స్టే విధించింది.


ఇవి కూడా చదవండి

72nd Miss World Festival: మహిళా సాధికారతపై ప్రశ్నలు.. తెలంగాణను ప్రశంసించిన అందగత్తెలు..

Viral Video: రన్నింగ్‌లో ఉన్న ట్రక్ నుంచి దొంగతనం.. సినిమాకు ఏ మాత్రం తీసి పోని యాక్షన్ సీన్..

Updated Date - May 23 , 2025 | 10:07 PM