UN Urges: భారత్-పాక్ సంయమనం పాటించాలి
ABN , Publish Date - Apr 26 , 2025 | 04:02 AM
పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలపై యూఎన్ ప్రధాన కార్యదర్శి గుటెరెస్ ఆందోళన వ్యక్తం చేశారు. రెండు దేశాలు సంయమనం పాటించి సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించార
ఉగ్రదాడి నేపథ్యంలో యూఎన్ సెక్రటరీ జనరల్ స్పందన
న్యూయార్క్, ఏప్రిల్ 25: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంపై ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటొనియో గుటేరస్ ఆందోళన వ్యక్తంచేశారు. రెండు దేశాలు సంయమనం పాటించాలని సూచించారు. గుటేరస్ తరపున ఆయన అధికార ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ మీడియాతో మాట్లాడారు. తాజా పరిణామాలను గుటేరస్ నిశితంగా పరిశీలిస్తున్నారని, ఏ సమస్య తలెత్తినా రెండు దేశాలు చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించారని వెల్లడించారు.