Share News

Andriy Parubiy Shot Dead: ఉక్రెయిన్ పార్లమెంట్ మాజీ స్పీకర్ దారుణ హత్య

ABN , Publish Date - Aug 30 , 2025 | 06:55 PM

ఆగంతకుడు పలు రౌండ్లు కాల్పులు జరపడంతో పరుబీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్టు ప్రాసిక్యూటర్ జనరల్ కార్యాలయం తెలిపింది. ఉక్రెయిన్‌లో ప్రముఖ నేతగా పేరున్న పరుబీ 2010లో ఉక్రెయిన్ పార్లమెంటు స్వీకర్‌గా పనిచేశారు.

Andriy Parubiy Shot Dead: ఉక్రెయిన్ పార్లమెంట్ మాజీ స్పీకర్ దారుణ హత్య
Andriy Parubiy

లెవివ్ సిటీ: ఉక్రెయిన్, రష్యా మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న క్రమంలో ఉక్రెయిన్ పార్లమెంటు మాజీ స్పీకర్ ఆండ్రీ పరుబీ (Andriy Parubiy) దారుణ హత్యకు గురయ్యారు. ఈ విషయాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాడిమిర్ జెలెన్‌స్కీ (Zelensky) వెల్లడించారు. లెవిల్‌లో గుర్తుతెలియని వ్యక్తులు ఈ దారుణ హత్య పాల్పడినట్టు చెప్పారు. పరుబీ కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని, హంతకుల కోసం గాలిస్తున్నామని తెలిపారు. హత్య వెనుక కారణాలు తెలియలేదన్నారు.

ఆగంతకుడు పలు రౌండ్లు కాల్పులు జరపడంతో పరుబీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్టు ప్రాసిక్యూటర్ జనరల్ కార్యాలయం తెలిపింది. ఉక్రెయిన్‌లో ప్రముఖ నేతగా పేరున్న పరుబీ 2010లో ఉక్రెయిన్ పార్లమెంటు స్వీకర్‌గా పనిచేశారు.

మరోవైపు, రష్యా శుక్రవారం రాత్రి జరిపిన డ్రోన్ దాడితో ఉక్రెయిన్‌కు చెందిన అతిపెద్ద నౌక ధ్వంసమై నీటి మునిగిపోవడంతో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉక్రెయిన్‌ సైనిక, వైమానిక స్థావరాలపై కచ్చితమైన దాడులు చేస్తున్నట్టు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇవి కూడా చదవండి..

చైనా చేరుకున్న ప్రధాని మోదీ.. ఏడేళ్ల తర్వాత ఇదే మొదటిసారి

సుంకాలు అమల్లోనే ఉన్నాయి.. కోర్టు తీర్పుపై డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 30 , 2025 | 07:32 PM