Share News

Elon Musk Dares Trump: ట్రంప్ సీరియస్ వార్నింగ్.. తగ్గేదేలా అన్న మస్క్..

ABN , Publish Date - Jul 01 , 2025 | 01:57 PM

Elon Musk Dares Trump: 15 రోజుల క్రితం ట్రంప్, మస్క్ రాజీకి వచ్చారు. మస్క్ విమర్శలు చేయటం ఆపేశారు. ఏమైందో ఏమో తెలీదు కానీ, పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. మస్క్ మళ్లీ విమర్శలు మొదలెట్టారు.

Elon Musk Dares Trump: ట్రంప్ సీరియస్ వార్నింగ్.. తగ్గేదేలా అన్న మస్క్..
Elon Musk Dares Trump

‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్’ అమెరికా రాజకీయాల్లో దుమారం రేపుతోంది. దోస్త్ మేరా దోస్త్ అనుకుంటూ తిరిగిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్‌ల మధ్య చిచ్చుపెట్టింది. మస్క్ ఈ బిల్లును మొదటి నుంచి వ్యతిరేకిస్తూ ఉన్నారు. తీవ్ర స్థాయిలో ట్రంప్‌పై .. ట్రంప్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వచ్చారు. సోషల్ మీడియాలో వరుస పోస్టులు పెట్టారు. అయితే, 15 రోజుల క్రితం ఇద్దరూ రాజీకి వచ్చారు. మస్క్ విమర్శలు చేయటం ఆపేశారు. ఏమైందో ఏమో తెలీదు కానీ, పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. మస్క్ మళ్లీ విమర్శలు మొదలెట్టారు.


దీంతో ట్రంప్‌కు కోపం వచ్చింది. మస్క్‌కు వార్నింగ్ ఇచ్చారు. సోమవారం రాత్రి తన సొంత సోషల్ మీడియా ట్రూత్‌లో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో .. ‘ నేను ఈ మాండేట్(ఈ మాండేట్ ప్రకారం కార్ల కంపెనీలు ప్రతీ సంవత్సరం ప్రభుత్వం చెప్పిన సంఖ్యలోనే కార్లను అమ్మాలి)ను వ్యతిరేకిస్తానని మస్క్‌ అనుకున్నాడు. అందుకే ఎన్నికల్లో నాకు పూర్తి మద్దతు ఇచ్చాడు. ఎలక్ట్రిక్ కార్లు మంచివే.. అలాగని అందరూ ఒక ఎలక్ట్రిక్ కారు కొనాలని రూలేమీ లేదు. ఇప్పటి వరకు చరిత్రలో ఎవ్వరికీ ఇవ్వనంత సబ్సీడీ మస్క్‌కు ఇచ్చాం.


సబ్సీడీ లేకపోతే మస్క్ షాపు మూసుకుని ఆఫ్రికా వెళ్లిపోవాల్సిందే. రాకేట్ లాంచ్‌లు ఉండవు. శాటిలైట్లు ఉండవు. ఎలక్ట్రిక్ కార్ల తయారీ కూడా ఉండదు. దేశం బాగుపడుంది. మస్క్ గురించి ఓ సారి ఆలోచించాలి. పెద్ద మొత్తంలో డబ్బులు మిగులుతాయి’ అని అన్నారు. ఈ పోస్టుపై ఎలన్ మస్క్ స్పందించాడు. తగ్గేదేలా అన్నట్లు ట్రంప్‌కు సమాధానం ఇచ్చాడు. ‘ఇప్పటికిప్పుడే సబ్సీడీ మొత్తం కట్ చేయ్’ అన్నాడు. అంతటితో మస్క్ ఆగలేదు. బిల్లుకు మద్దతు తెలుపుతున్న సెనేటర్లకు వార్నింగ్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో వారి సంగతి తేలుస్తానన్నాడు.


ఇవి కూడా చదవండి

గురూజీతో బాధ చెప్పుకున్నాడు.. వీడియో చూసి మర్డర్ ప్లాన్

కూతురి కోసం తండ్రి సాహసం.. నడి సంద్రంలో ప్రాణాలకు తెగించి..

Updated Date - Jul 01 , 2025 | 02:15 PM