Tariff on Mexico: మెక్సికోకు ఊరట.. ఏప్రిల్ 2 వరకూ సుంకాల విధింపు వాయిదా
ABN , Publish Date - Mar 06 , 2025 | 11:26 PM
మెక్సికో దిగుమతులపై సుంకాల విధింపును ఏప్రిల్ 2 వరకూ వాయిదా వేస్తున్నట్టు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.

ఇంటర్నెట్ డెస్క్: సుంకాల పేరిట ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మెక్సికోకు స్వల్ప ఊరట కల్పించారు. మెక్సికోపై సుంకాల విధింపును ఏర్పిల్ 2 వరకూ వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్‌తో ఫోన్ చర్చల అనంతరం ట్రంప్ నిర్ణయాన్ని ప్రకటించారు. ‘‘కాస్త వెసులుబాటు కల్పించేందుకు ఇలా చేశా. మెక్సికో అధ్యక్షురాలంటే నాకు గౌరవం కూడా. మా మధ్య సత్సంబంధాలే ఉన్నాయి’’ అని ట్రంప్ సొంత సోషల్ మీడియా ట్రూత్ సోషల్ వేదికగా వెల్లడించారు. మెక్సికో, కెనడ, అమెరికాల మధ్య గతంలో కుదిరిన వాణిజ్య ఒప్పందం మేరకు వెక్సికోపై ఏప్రిల్ 2 వరకూ సుంకాల వడ్డింపులు ఉండవని అన్నారు. ఆ తరువాత యథాప్రకారం ప్రతీకార సుంకాల విధింపు కొనసాగుతుందని అన్నారు.
Tesla Cars Torched In France: మస్క్‌పై పెరుగుతున్న వ్యతిరేకత.. టెస్లా కార్లకు నిప్పు
మరోవైపు, కెనడాపై మాత్రం ట్రంప్ విరుచుకుపడుతున్నారు. కెనడా ప్రధాని ట్రూడో ఎలాగైనా పదవిలో కొనసాగేందుకు సుంకాల విధింపును తనకు అనుకూలంగా వాడుకుంటున్నారు. గురువారం కెనడా ప్రధాని ట్రూడో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై మండిపడ్డారు. కొన్ని రంగాల్లో వెసులుబాటులు వచ్చినా వాణిజ్య యుద్ధం మాత్రం కొనసాగుతుందని అన్నారు. అమెరికా అన్ని సుంకాలను ఉపసంహరించుకునేలా చేయడమే తన లక్ష్యమని అన్నారు.
జనవరిలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి డొనాల్డ్ ట్రంప్ సుంకాలు విధిస్తానంటూ పలుమార్లు హెచ్చరించిన విషయం తెలిసిందే. అమెరికాకు ముఖ్య భాగస్వాములుగా ఉన్న కెనడా, మెక్సికోల నుంచి వలసలు అడ్డుకునేందుకు, మాదక ద్రవ్యాల అక్రమరవాణాను నిర్మూలించేందుకు సుంకాలు విధించకతప్పదని స్పష్టం చేశారు.
Russia: ఉక్రెయిన్‌తో శాంతికి రష్యా సిద్ధం!
మరోవైపు చైనా కూడా ట్రంప్ సుంకాల విధింపునకు దీటుగా స్పందించింది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా అనేది అమెరికాకు సంబంధించిన అంశమని, సుంకాల విధింపుతో దీనికి పరిష్కారం లభించదని అన్నారు. ఇదిలా ఉంటే అమెరికాలో వాణిజ్య లోటు జనవరిలో రికార్డు స్థాయిని చేరుకుంది. 34 శాతం పెరిగి ఏకంగా 131.4 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దీంతో, బంగారానికి మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
మరిన్ని అంతర్జాతీయ, వాణిజ్య వార్తల కోసం క్లిక్ చేయండి