Russia: ఉక్రెయిన్‌తో శాంతికి రష్యా సిద్ధం!
ABN , Publish Date - Mar 06 , 2025 | 05:22 AM
ఉక్రెయిన్ కూడా చర్చలకు సిద్ధమని ప్రకటించిందని, ఈ మేరకు ఆ దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీ తనకు లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశారు. మంగళవారం రాత్రి అమెరికా చట్టసభల (కాంగ్రెస్) సంయుక్త సమావేశంలో ట్రంప్ మాట్లాడారు.

అమెరికా కాంగ్రెస్‌లో ట్రంప్ వెల్లడి
న్యూయార్క్, మార్చి 5: ఉక్రెయిన్‌తో శాంతియుత సంబంధాలను నెలకొల్పుకోవటానికి సిద్ధంగా ఉన్నట్లు రష్యా నుంచి బలమైన సంకేతాలు తనకు అందాయని ట్రంప్ తెలిపారు. ఉక్రెయిన్ కూడా చర్చలకు సిద్ధమని ప్రకటించిందని, ఈ మేరకు ఆ దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీ తనకు లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశారు. మంగళవారం రాత్రి అమెరికా చట్టసభల (కాంగ్రెస్) సంయుక్త సమావేశంలో ట్రంప్ మాట్లాడారు. రెండోసారి అధ్యక్షుడైన తర్వాత కాంగ్రె్‌సలో ఇదే ఆయన తొలి ప్రసంగం. మూడేళ్లుగా జరుగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో వారానికి సగటున 2 వేల మందికిపైగా మరణిస్తున్నారని ట్రంప్ చెప్పారు. ‘ఈ యుద్ధంలో అమెరికన్లేమీ చనిపోవటం లేదు.. కానీ, నేను ఆపాలనుకుంటున్నా. ఈ ఉన్మాదాన్ని, ఆ హత్యాకాండను ఆపాలనుకుంటున్నా’ అని తెలిపారు. యుద్ధంలో ఉక్రెయిన్‌కు మద్దతిస్తున్నామని చెబుతున్న యూరప్ దేశాల గురించి ప్రస్తావిస్తూ.. ఉక్రెయిన్ రక్షణకు ఖర్చు చేసిన దానికన్నా, రష్యా నుంచి చమురు, సహజవాయువు కొనుగోలు చేయటానికి యూరప్ దేశాలు ఎక్కువ ఖర్చు చేశాయని ట్రంప్ పేర్కొన్నారు. మరోవైపు, 2021లో కాబూల్‌లో ఆత్మాహుతి దాడి జరిపి 13 మంది అమెరికన్ సైనికులను చంపిన ఘటనకు బాధ్యుడైన ఉగ్రవాది షరీఫుల్లాను పట్టుకున్నామని, అఫ్గానిస్థాన్ నుంచి అమెరికాకు తరలిస్తున్నామని ట్రంప్ వెల్లడించారు. కాగా, రష్యాతో వీలైనంత త్వరగా శాంతి చర్చలు జరిపేందుకు జెలెన్‌స్కీ సంసిద్ధత వ్యక్తం చేయడం సానుకూల పరిణామమని రష్యా అఽధ్యక్ష భవనం పేర్కొంది. అయితే, రష్యాతో చర్చలను నిరోధిస్తూ 2022లో ఉక్రెయిన్ జారీ చేసిన ఉత్తర్వుల సంగతేంటని ప్రశ్నించింది.
ఇవి కూడా చదవండి
Uttarakhand: ఉత్తరాఖండ్ ఘటనలో నలుగురు మృత్యువాత.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
Parvesh Verma: తీహార్ నుంచి ఇక ఆయన తిరిగి రాకపోవచ్చు.. కేజ్రీవాల్ అవినీతిపై పర్వేష్ వర్మ
Congress: కేరళ కాంగ్రెస్ నేతల భేటీకి థరూర్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.