Share News

Trump on Putin Remarks: ఆ ప్రకటన హర్షనీయమే కానీ.. పుతిన్ ప్రకటనపై ట్రంప్ రియాక్షన్

ABN , Publish Date - Mar 13 , 2025 | 11:51 PM

కాల్పుల విరమణకు సిద్ధమేనన్న పుతిన ప్రకటన హర్షనీయమే కానీ అసంపూర్తిగా ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు.

Trump on Putin Remarks: ఆ ప్రకటన హర్షనీయమే కానీ.. పుతిన్ ప్రకటనపై ట్రంప్ రియాక్షన్
Donald Trump Response to Putin's remarks on Cease fire

ఇంటర్నెట్ డెస్క్: ఉక్రెయిన్‌తో 30 రోజుల పాటు కాల్పుల విరమణ ప్రతిపాదనపై రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన వ్యాఖ్యలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా స్పందించారు. పుతిన్ కామెంట్స్ హర్షనీయమే కానీ అసంపూర్తిగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ‘‘పుతిన్‌ను కలిసి మాట్లాడాలి. కానీ ఈ విషయంలో రెండు దేశాలు మరింత వేగంగా స్పందించాలి’’ అని వ్యాఖ్యానించారు.

తాత్కాలిక కాల్పుల విరమణ ప్రతిపాదనపై పుతిన్‌తో చర్చించేందుకు అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ రష్యా చేరుకున్న విషయం తెలిసిందే. ఈ చర్చల విషయమై స్పందించిన ట్రంప్.. రష్యా ఈ ప్రతిపాదనలను తిరస్కరిస్తే అది ప్రపంచానికి విచారకర పరిణామమని వ్యాఖ్యానించారు. ‘‘తుది ఒప్పందంలోని అనేక అంశాలను ఇప్పటికే చర్చకు వచ్చాయి. మరి ఈ విషయంలో రష్యా ఏం చేస్తుందో చూడాలి’’ అని అన్నారు.


Cease Fire Putin: ఉక్రెయిన్‌తో కాల్పులపై రష్యా అధ్యక్షుడి తొలి స్పందన ఏంటంటే..

దీర్ఘకాలిక శాంతి స్థాపన దిశగా చర్చలు జరుగుతున్న సంకేతాన్ని కూడా ట్రంప్ పేర్కొన్నారు. ఉక్రెయిన్ రష్యాకు ఏ మేరకు భూభాగాన్ని వదులుకోవాలనే విషయంపై కూడా చర్చ జరిగినట్టు ట్రంప్ తెలిపారు. ఈ విషయాలన్నీ అందరికీ తెలిసేలాగానే చర్చిస్తున్నామని తెలిపారు.

ఓ భారీ విద్యు్త్ కేంద్రం ఎవరికి చెందాలన్న దానిపై కూడా ఆలోచిస్తున్నామని చెప్పారు. అయితే, ఆ విద్యుత్ కేంద్రం ఏమిటనేదానిపై మాత్రం వివరాలు వెల్లడించలేదు. చర్చలు మాత్రం చాలా సంక్లిష్టమైనవని అన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా 2022 ఫిబ్రవరిలో పూర్తి స్థాయి దాడికి దిగిన విషయం తెలిసిందే.


Pak Train Hijack Taliban: పాక్ రైలు హైజాకింగ్.. తాలిబాన్ల కీలక ప్రకటన

ఇక రష్యాతో రాజీ పడక తప్పదని ఉక్రెయిన్‌కు ట్రంప్ స్పష్టం చేసిన నేపథ్యంలో తాత్కాలిక కాల్పుల విరమణకు ఉక్రెయిన్ అంగీకరించింది. ఈ నేపథ్యంలో 30 రోజలు పాటు యుద్ధానికి విరామం ఇచ్చేందుకు సౌదీ వేదికగా అమెరికాతో జరిగిన చర్చల్లో ఉక్రెయిన్ ఓకే చెప్పింది. ఇక అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, ప్రస్తుతం వ్యూహాత్మక ప్రాంతమైన కుర్సుక్‌ నుంచి ఉక్రెయిన్ సేనలను తరిమేసేందుకు రష్యా సేనలు యుద్ధం చేస్తున్నాయి. తమ సైన్యం పురోగతిని బట్టి తదుపరి చర్యలు ఉంటాయని తాజాగా పుతిన్ పేర్కొన్నారు.

NASA mission delay: వ్యోమగాముల రాక మరింత ఆలస్యం.. చివరి నిమిషంలో

Read Latest and International News

Updated Date - Mar 14 , 2025 | 12:07 AM