Share News

Signed Book: మోదీ... మీరు గొప్ప వారు!

ABN , Publish Date - Feb 15 , 2025 | 05:32 AM

ఇది 320 పేజీల పుస్తకం. గతంలో అధ్యక్ష పదవిలో ఉన్నప్పటి జ్ఞాపకాలను ట్రంప్‌ అందులో పొందుపరిచారు. ఆన్‌లైన్‌లో ఈ పుస్తకం ఖరీదు రూ.6,000-6,873 వరకు ఉంది.

Signed Book: మోదీ... మీరు గొప్ప వారు!

ప్రధానికి ‘అవర్‌ జర్నీ టుగెదర్‌’ పుస్తకం ఇచ్చిన ట్రంప్‌

వాషింగ్టన్‌, ఫిబ్రవరి 14: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలకు కూర్చునే ముందు.. స్వహస్తాలతో సంతకం చేసిన తన పుస్తకం ‘అవర్‌ జర్నీ టుగెదర్‌’ పుస్తకాన్ని ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా ‘మిస్టర్‌ ప్రైమ్‌మినిస్టర్‌! యువార్‌ గ్రేట్‌’ అని దానిపై రాశారు. ఇది 320 పేజీల పుస్తకం. గతంలో అధ్యక్ష పదవిలో ఉన్నప్పటి జ్ఞాపకాలను ట్రంప్‌ అందులో పొందుపరిచారు. ఆన్‌లైన్‌లో ఈ పుస్తకం ఖరీదు రూ.6,000-6,873 వరకు ఉంది. 2019 సెప్టెంబరు 22న హూస్టన్‌లో ఇద్దరు నేతలు పాల్గొన్న ‘హౌడీ మోడీ’, 2020 ఫిబ్రవరి 24, 25 తేదీల్లో అహ్మదాబాద్‌లో నిర్వహించిన ‘నమస్తే ట్రంప్‌’ కార్యక్రమాల తాలూకు ఫొటోలను కూడా ఇందులో ముద్రించారు. అలాగే మెక్సికోతో సరిహద్దులో గోడ నిర్మాణం, ఫెడరల్‌ జడ్జీల ధ్రువీకరణ, అంతరిక్ష బలగం ఏర్పాటు, ఉత్తర కొరియా, చైనా, రష్యా అధినేతలు కిమ్‌ జోంగ్‌-ఉన్‌, జీ జిన్‌పింగ్‌, వ్లాదిమిర్‌ పుతిన్‌లతో అత్యున్నత స్థాయి సమావేశాల గురించీ అందులో వివరించారు.


కాగా.. శుక్రవారం వైట్‌హౌ్‌సలో మోదీని ఆలింగనం చేసుకున్న ట్రంప్‌.. ఆయన్ను ఇక్కడ మళ్లీ కలుస్తున్నందుకు ఆనందంగా ఉందని వ్యాఖ్యానించారు. అనంతరం జరిగిన ఉమ్మడి విలేకరుల సమావేశంలో.. 2020లో భారత్‌లో జరిపిన తన చరిత్రాత్మక పర్యటన సందర్భంగా తాజ్‌మహల్‌ను సందర్శించినప్పుడు తీసుకున్న చిరస్మరణీయ ఫొటోను కూడా ట్రంప్‌ ప్రధానికి అందించారు. తనకు, తన భార్య మెలానియాకు అప్పట్లో మోదీ ఇచ్చిన ఆతిథ్యాన్ని గుర్తుచేసుకున్నారు. తాను కూడా ఇప్పుడు ఆతిథ్యం ఇస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. మోదీని ప్రత్యేక వ్యక్తిగా అభివర్ణించారు. తమ సుదీర్ఘ మైత్రిని, గతంలో జరిపిన భేటీలను కూడా ప్రస్తావించారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో, ఎలాన్‌ మస్క్‌లను మోదీకి ట్రంప్‌ పరిచయం చేశారు.


ఇవి కూడా చదవండి...

PM Modi: ప్రధాని మోదీ డొనాల్డ్ ట్రంప్ సమావేశం.. అక్రమ వలసదారుల విషయంపై మోదీ కీలక వ్యాఖ్యలు

CEC: కొత్త సీఈసీ ఎంపికకు కసరత్తు.. 18న రాజీవ్ కుమార్ పదవీవిరమణ

Chennai: కమల్‌హాసన్‌తో ఉప ముఖ్యమంత్రి భేటీ..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 15 , 2025 | 05:32 AM