Donald Trump: భారత ఎన్నికల్లో బైడెన్ జోక్యం
ABN , Publish Date - Feb 21 , 2025 | 05:10 AM
భారత్‌లో మరెవరినో గెలిపించేందుకు నాటి బైడెన్ ప్రభుత్వం ప్రయత్నించినట్టుందని ఆరోపించారు. ఇది భారతదేశ ఎన్నికల్లో జోక్యం చేసుకోవడమేనని తేల్చిచెప్పారు. ఈ విషయాన్ని భారత ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉందన్నారు.
అక్కడ ఎవరినో గెలిపించేందుకు యత్నించారు
భారత్‌లో ఓటింగ్‌కు మన నిధులెందుకు?
దీని గురించి మనం భారత
ప్రభుత్వానికి తెలియజేయాలి: ట్రంప్
విదేశీ శక్తుల ఆయుధంగా రాహుల్: బీజేపీ
భారత్‌కు ‘యూఎ్‌సఎయిడ్’పై
శ్వేతపత్రానికి కాంగ్రెస్ డిమాండ్
భారత ఎన్నికల్లో బైడెన్ జోక్యం
న్యూయార్క్, న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: భారతదేశ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు యూఎ్‌సఎయిడ్ నిధులు రూ.181 కోట్లు (21 మిలియన్ డాలర్లు) వెచ్చించడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో మరెవరినో గెలిపించేందుకు నాటి బైడెన్ ప్రభుత్వం ప్రయత్నించినట్టుందని ఆరోపించారు. ఇది భారతదేశ ఎన్నికల్లో జోక్యం చేసుకోవడమేనని తేల్చిచెప్పారు. ఈ విషయాన్ని భారత ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉందన్నారు. గురువారం మియామీలో ఎఫ్‌ఐఐ ప్రయారిటీ సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలోనూ అనేకసార్లు ఈ అంశాన్ని ట్రంప్ లేవనెత్తారు. బుధవారం కూడా భారత్‌లో ఓటింగ్ శాతం పెంచడానికి అమెరికా నిధులు ఎందుకివ్వాలని ట్రంప్ ప్రశ్నించారు. యూఎ్‌సఎయిడ్ ద్వారా వివిధ దేశాలకు అమెరికా నుంచి అందుతున్న సాయానికి సంబంధించిన జాబితాను ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డోజ్(డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ) ఇటీవల విడుదల చేసింది. భారత్‌లో ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల కమిషన్‌కు రూ.181 కోట్లు ఇవ్వడం కూడా ఆ జాబితాలో ఉంది.
దీనిపై ఎఫ్‌ఐఐ సదస్సులో ట్రంప్ మాట్లాడుతూ తాను అధ్యక్షుడవ్వక ముందు అమెరికా నిధులు ఎలా దుర్వినియోగమయ్యాయనేందుకు ఇదొక ఉదాహరణ అన్నారు. ‘భారత్‌లో ఓటింగ్ శాతం పెంచేందుకు మనమెందుకు రూ.181 కోట్లు వెచ్చించాలి? అక్కడ మరెవరినో గెలిపించేందుకు వారు(బైడెన్ యంత్రాంగం) ప్రయత్నించి ఉంటారని నాకు అనిపిస్తోంది. మనం ఈ విషయాన్ని భారత ప్రభుత్వానికి తెలియజేయాలి. మన దేశంలో రష్యా కేవలం 173 రూపాయలు (2 డాలర్లు) వెచ్చించిందంటేనే అదొక పెద్ద డీల్ అవుతుంది. భారత ఎన్నికల్లో మనం రూ.181 కోట్లు వెచ్చించడం అదొక సంచలనమే. బంగ్లాదేశ్‌లో రాజకీయాలను బలోపేతం చేయడానికి రూ.251 కోట్లు (29 మిలియన్ డాలర్లు) వెచ్చించారు. ఆసియా దేశాలు ఆర్థికంగా బలంగా ఉన్నాయి. వాటికి మన నిధులు ఇవ్వనవసరం లేదు’ అన్నారు.
భారత్‌లో రాజకీయ దుమారం
ట్రంప్ తాజా వ్యాఖ్యలు భారత్‌లో రాజకీయ దుమారం రేపుతున్నాయి. తాను తిరిగి అధికారంలోకిరాకుండా అడ్డుకునేందుకు విదేశీ శక్తులు ప్రయత్నిస్తున్నాయని ప్రధాని మోదీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో చేసిన వ్యాఖ్యలను ట్రంప్ తాజా వ్యాఖ్యలు నిర్ధారిస్తున్నాయని బీజేపీ ఐటీ విభాగం అధ్యక్షుడు అమిత్ మాలవీయ గురువారం ‘ఎక్స్’లో వరుస పోస్టులు పెట్టారు. భారత ప్రయోజనాలను దెబ్బతీసే విదేశీ శక్తులకు రాహుల్ ఆయుధంగా మారారని ధ్వజమెత్తారు. దశాబ్దాలుగా యూఎ్‌సఎయిడ్ ద్వారా భారత్‌లోని సంస్థలకు అందుతున్న సాయానికి సంబంధించి ప్రభు త్వం శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ డిమాండ్ చేశారు.
నాటో దేశాలన్నింటి నుంచి అమెరికా సేనల ఉపసంహరణ?
సౌదీ అరేబియాలో ఈ వారం జరగనున్న అమెరికా, రష్యా చర్చల అనంతరం అన్ని నాటో దేశాల నుంచి అమెరికా సేనలను ఉపసంహరించనున్నట్టు జర్మనీ పత్రిక ‘బిల్డ్’ తాజాగా కథనాన్ని ప్రచురించింది. అయితే, ఈ కథనాన్ని ఇంతవరకు వైట్‌హౌస్ నిర్ధారించలేదు.
ఇవి కూడా చదవండి:
Paper Leak: టెన్త్ క్లాస్ పేపర్ లీక్.. హిందీ, సైన్స్ పరీక్షలు రద్దు
Atishi: వచ్చి రాగానే కొత్త ప్రభుత్వంపై ఆప్ ఒత్తిడి.. ఢిల్లీ మహిళలు వేచి చూస్తున్నారని..
Google Pay: గూగుల్ పేలో కూడా బాదుడు మొదలు.. ఈ చెల్లింపులకు
Stock Markets: ఈరోజు కూడా నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. టాప్ 5 లాసింగ్ స్టాక్స్
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్
Read More Business News and Latest Telugu News