Donald Trump - BRICS: నా వార్నింగ్‌కు బ్రిక్స్ కూటమి ‘విచ్ఛిన్నమైపోయింది’: డొనాల్ట్ ట్రంప్
ABN , Publish Date - Feb 21 , 2025 | 10:44 AM
సుంకాలు విధిస్తానన్న తన వార్నింగ్ తరువాత బ్రిక్స్ దేశాల కూటమి విచ్ఛిన్నమైందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా పేర్కొన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా కరెన్సీ డాలర్ ఆధిపత్యాన్ని కూలదోసే ప్రయత్నం చేస్తే 150 శాతం సుంకం విధిస్తానంటూ తన చేసి హెచ్చరికతో బ్రిక్స్ దేశాలు సైలెంట్ అయిపోయానని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ వ్యాఖ్యానించారు. తన హెచ్చరిక తరువాత బ్రిక్స్ కూటమి ‘విచ్ఛిన్నమైపోయిందని’ వ్యాఖ్యానించారు. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, యూఏఈ దేశాల కూటిమిని బ్రిక్స్ అంటారన్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ వాణిజ్యంలో డాలర్ ప్రాబల్యానికి చెక్ పెట్టేందుకు బ్రిక్స్ దేశాలు ఓ ఉమ్మడి కరెన్సీ ప్రతిపాదనను తెరపైకి తెచ్చాయి (USA).
Donald Trump: భారత ఎన్నికల్లో బైడెన్ జోక్యం
‘‘బ్రిక్స్ దేశాలు మన డాలర్‌ను నాశనం చేద్దామని అనుకున్నాయి. వారికంటూ ఓ కొత్త కరెన్సీ ఏర్పాటు చేద్దామనుకునర్నాయి. కానీ నేను అధికారంలోకి రాగానే మొదట చేసిన పని.. సుంకాలు విధిస్తానని హెచ్చరించడం. బ్రిక్స దేశం ఏదైనా డాలర్ ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తే వారి ఉత్పత్తులపై 150 శాతం సుంకం విధిస్తానని అన్నాను. వారి వస్తులను దిగుమతి చేసుకోమని హెచ్చరించాను. అంతే.. బ్రిక్స్ కూటమి విచ్ఛిన్నమైపోయింది. వారికేమైందో కూడా నాకు తెలియదు. ఆ తరువాత ఆ కుటమి వార్తలేవీ కనిపించలేదు’’ అని అన్నారు.
Elon Musk: రాజకీయ కారణాల వల్లే నాసా ఆస్ట్రోనాట్‌లు స్పేస్ స్టేషన్‌లో ఇరుక్కుపోయారు: ఎలాన్ మస్క్
డాలర్‌తో ఆటలు ఆడితే బ్రిక్స్ దేశాల నుంచి వచ్చే దిగుమతులపై వంద శాతం సుంకం విధిస్తానని డొనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరి 13న హెచ్చరించారు. బ్రిక్స్ ఇక కనుమరుగేనని అన్నారు. తాజాగా మరోసారి అవే హెచ్చరికలు చేశారు. తమ వాణిజ్య కూటమి కోసం ప్రత్యేక కరెన్సీని ఏర్పాటు చేసుకుంటే వారితో వాణిజ్యం నెరపబోమని హెచ్చరించారు.
2023లో జరిగిన 15వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డాలర్‌కు వినియోగాన్ని తుడిచిపెట్టేయాలని పిలుపునిచ్చారు. ‘‘బ్రిక్స్ దేశాలు తమ జాతీయ కరెన్సీల్లోనే చెల్లింపులు జరుపుకోవాలి, ఇందు కోసం జాతీయ బ్యాంకుల మధ్య సహకారం పెంపొందించుకోవాలి’’ అని పుతిన్ అన్నారు.
S-350 Air Defence System: అత్యాధునిక మిసైల్ రక్షణ వ్యవస్థ ధ్వంసం.. రష్యాకు ఉక్రెయిన్ షాక్
మరిన్ని అంతర్జాతీయ కథనాల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి