Share News

Trump Tariff Exemption: ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్లకు సుంకాల మినహాయింపు

ABN , Publish Date - Apr 13 , 2025 | 04:24 AM

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాపులు, సెమీకండక్టర్లపై సుంకాలకు మినహాయింపు ప్రకటించారు. ఈ మినహాయింపులు చైనాకు కూడా వర్తిస్తాయి

Trump Tariff Exemption: ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్లకు సుంకాల మినహాయింపు

  • సెమీకండక్టర్లు, చిప్‌లు తదితర ఉత్పత్తులకు కూడా..

  • చైనా సహా అన్ని దేశాలకూ వర్తింపు

వాషింగ్టన్‌, ఏప్రిల్‌ 12: సుంకాల నుంచి స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, సెమీకండక్టర్లు, హైటెక్‌ ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలకు మినహాయింపునిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు శనివారం ఆ దేశ ‘కస్టమ్స్‌ అండ్‌ బార్డర్‌ ప్రొటెక్షన్‌’ విభాగం ఓ నోటీసు జారీ చేసింది. దీని ప్రకారం చైనా మీద విధించిన 145ు సుంకంగానీ, అన్ని విదేశీ సరుకుల మీద విధించిన 10ు సాధారణ సుంకంగానీ ఈ ఉత్పత్తులకు వర్తించదు. ట్రంప్‌ తాజాగా ప్రకటించిన ప్రతీకార సుంకాలపై అమెరికన్లలో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. చిప్‌లు, ప్రాసెసర్లు వంటివి అమెరికాలో పెద్ద ఎత్తున ఉత్పత్తి కావటం లేదు. వీటితోపాటు ఇతర ఎలకా్ట్రనిక్‌ ఉత్పత్తుల కోసం అమెరికా దిగుమతులపైనే ఆధారపడుతోంది. అడ్డగోలు సుంకాల వల్ల ఈ ఉత్పత్తుల ధరలు ఆకాశన్నంటే ప్రమాదం ఉంది. ఇది అంతిమంగా వినియోగదారులకు పెనుభారంగా మారుతుంది. దీనిపై సాధారణ అమెరికన్లతోపాటు టెక్‌ దిగ్గజ సంస్థలైన యాపిల్‌, శాంసంగ్‌, చిప్‌ తయారీ కంపెనీలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలోనే, ట్రంప్‌ తాజా మినహాయింపులు ప్రకటించినట్లు తెలుస్తోంది


ఈ వార్తలు కూడా చదవండి:

Minister Kollu Ravindra: కులాలు, మతాల మధ్య చిచ్చుపెడితే.. మంత్రి కొల్లు రవీంద్ర మాస్ వార్నింగ్..

South Central Railway: గుడ్ న్యూస్ చెప్పిన దక్షిణ మధ్య రైల్వే.. ఆ ప్రాంతాల్లో ప్రత్యేక రైళ్లు..

Updated Date - Apr 13 , 2025 | 04:55 AM