Share News

Warrior Dividend: సైనికులకు గుడ్ ‌న్యూస్.. ఒక్కోరికి లక్ష రూపాయల డివిడెండ్

ABN , Publish Date - Dec 18 , 2025 | 09:39 AM

అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్కో సైనికుడి ఖాతాలోకి 1776 డాలర్లు జమ చేయనున్నట్లు తెలిపింది. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంతో దేశ వ్యాప్తంగా ఉన్న 1.4 మిలియన్ల సైనికులు లబ్ది పొందనున్నారు.

Warrior Dividend: సైనికులకు గుడ్ ‌న్యూస్.. ఒక్కోరికి లక్ష రూపాయల డివిడెండ్
Warrior Dividend

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ సైనికులకు గుడ్ ‌న్యూస్ చెప్పారు. ‘వారియర్ డివిడెండ్’ పేరిట భారీ నజరానా ప్రకటించారు. ఒక్కో సైనికుడి ఖాతాలోకి 1776 డాలర్లు జమ చేయనున్నట్లు తెలిపారు. సైనికుల సేవలు, బలిదానాలను గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ తెలిపారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంతో దేశ వ్యాప్తంగా ఉన్న 1.4 మిలియన్ల సైనికులు లబ్ది పొందనున్నారు. క్రిస్మస్ కంటే ముందే వారి ఖాతాలోకి 1,60,000 రూపాయలు జమ కానున్నాయి. బుధవారం జాతిని ఉద్దేశించి ట్రంప్ మాట్లాడుతూ.. ‘టారీఫ్‌లు పెంచాం. వాటితో పాటు వన్ బిగ్ బ్యూటిపుల్ బిల్‌‌ను పాస్ చేశాం.


ఈ రోజు 1,450,000 మంది సైనికులకు స్పెషల్ వారియర్ డివిడెండ్ ప్రకటిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ప్రతీ పౌరుడికి క్రిస్మస్‌కు ముందు 1,776 డాలర్లు ఇస్తున్నాం. చెక్కులు ఇప్పటికే సెండ్ చేశాం. టారీఫ్‌లు, బిగ్ బ్యూటిఫుల్ బిల్ కారణంగా ఎవ్వరూ ఊహించనంత డబ్బు సంపాదించాం. ఆ డబ్బులు ఆర్మీ వారికి ఉపయోగించటమే ఉత్తమం. సైనికులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’ అని అన్నారు. అమెరికా ప్రభుత్వం తమ సైనికులకు 1776 డాలర్లు డివిడెండ్ ఇవ్వటం వెనుక ఓ చారీత్రాత్మక కారణం ఉంది. 1776లో బ్రిటన్ నుంచి అమెరికా స్వాతంత్ర్యం ప్రకటించుకుంది. అందుకే ప్రభుత్వం సైనికులకు 1776 డాలర్లు డివిడెండ్‌గా ఇస్తోంది.


ఉగ్రపోరులో కలిసి రండి..

వైట్‌హౌ్‌సలో మంగళవారం జరిగిన ‘హనుక్కా’ కార్యక్రమంలో ట్రంప్‌ పాల్గొన్నారు. ఆస్ట్రేలియాలోని బోండి బీచ్‌లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అంతర్జాతీయ సమాజానికి కీలక పిలుపునిచ్చారు. ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు దేశాలన్నీ కలిసి రావాలని ఆయన కోరారు. ‘‘ఇస్లామిక్‌ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశాలన్నీ ఏకంకావాలి.’’ అని పిలుపునిచ్చారు. ఉగ్రవాదులను ‘రాడికల్‌ ఇస్లామిక్‌ టెర్రరిస్టులు’గా ఆయన పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి

శీతాకాలంలో ఈ కూరగాయలను ఫ్రిజ్‌లో ఉంచే పొరపాటు చేయకండి.!

ఐ బొమ్మ రవికి మరోసారి పోలీస్ కస్టడీ.. కీలక అంశాలపై ఫోకస్

Updated Date - Dec 18 , 2025 | 09:44 AM