Resolute Desk: ముక్కులో వేలెట్టి రుద్దాడని 145 ఏళ్ల నాటి డెస్క్‌నే మార్చేశారు!
ABN , Publish Date - Feb 23 , 2025 | 05:22 AM
మొన్నటిదాకా అధ్యక్షుడిగా పనిచేసిన బైడెన్, రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక ట్రంప్ కూడా నిన్నటిదాకా ఈ డెస్క్‌నే ఉపయోగించారు.

వాషింగ్టన్, ఫిబ్రవరి 22: అది అమెరికా వైట్‌హౌస్ ఓవల్ ఆఫీసులోని 145 ఏళ్లనాటి ‘రెసొల్యూట్ డెస్క్’! ఉడ్రోవిల్సన్, ట్రుమన్, జాన్ ఎఫ్ కెన్నడీ, రీగన్, క్లింటన్, ఒబామా.. ఇలా ఎంతో మంది అధ్యక్షులు ఎన్నో ముఖ్యమైన ఫైళ్లు పెట్టుకొని సంతకాలు చేసిన డెస్క్ అది! మొన్నటిదాకా అధ్యక్షుడిగా పనిచేసిన బైడెన్, రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక ట్రంప్ కూడా నిన్నటిదాకా ఈ డెస్క్‌నే ఉపయోగించారు. అయితే ఎలాన్ మస్క్ నాలుగేళ్ల కుమారుడి తెలిసీ తెలియని చేష్టలు దశాబ్దాల చరిత్ర గల ఈ డెస్క్‌ను పక్కనబెట్టేలా చేశాయి. ఇటీవల ఓవల్ ఆఫీసులో తన కుమారుడితో కలిసి ట్రంప్‌తో మస్క్ సమావేశయ్యారు.
ఈ సందర్భంగా మస్క్ భుజానెక్కుతూ.. ఆఫీసులో కలియతిరుగుతూ ఆ చిన్నారి చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. ఈ క్రమంలో ఆ చిన్నారి.. ముక్కులో వేలు పెట్టుకొని ఆ వేలును ట్రంప్ ఎదురుగా ఉన్న ‘రెసల్యూట్ డెస్క్’కు రుద్దడం వంటి పనులు చేశారు. అతి పరిశుభ్రత పాటించే ట్రంప్ ఆ చిన్నారి చేష్ట కారణంగా రెసొల్యూట్ డెస్క్‌ను ఆఫీసు నుంచి తాత్కాలికంగా తొలగించాలని ఆదేశించారు. దాని స్థానంలో ‘సీ అండ్ ఓ’ డెస్క్‌ను పెట్టించారు. సీఅండ్‌ఓ డెస్క్‌ను జార్జ్ బుష్ తదితర అధ్యక్షులు ఉపయోగించారు అని ట్రంప్ పేర్కొన్నారు. 1880లో బ్రిటన్ రాణి క్వీన్ విక్టోరియా ఈ రెసొల్యూట్ డెస్క్‌ను నాటి అధ్యక్షుడు రుథర్‌ఫోర్డ్‌కు బహుమతిగా ఇచ్చారు.
ఇవి కూడా చదవండి..
Kerala: కేరళలో సంచలనం సృష్టిస్తున్న సామూహిక ఆత్మహత్యలు.. అసలేం జరిగిందంటే..
Delhi: ఛావా ఎఫెక్ట్.. సైన్‌బోర్డులపై బ్లాక్ స్ప్రే, శివాజీ పోస్టర్లు
Maha Kumbh Mela 2025: మహాకుంభ మేళా ఎఫెక్ట్.. ఫిబ్రవరి 25-28 వరకు ఈ రైళ్లు రద్దు..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.