Share News

Harvard University: హార్వర్డ్ విశ్వవిద్యాలయంపై ట్రంప్ ఆంక్షలు.. విదేశీ విద్యార్థులకు షాక్..

ABN , Publish Date - May 23 , 2025 | 08:24 AM

ట్రంప్ ప్రభుత్వం హర్వర్డ్ విశ్వవిద్యాలయం (Harvard University) విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో విదేశీ విద్యార్థులను చేర్చుకోవడానికి హార్వర్డ్‌ యూనివర్సిటీకి అనుమతి రద్దు చేసింది. ఈ కారణంగా అక్కడే చదువుతున్న భారత విద్యార్థులు సహా ఇతర విదేశీ విద్యార్థులపై కూడా ప్రభావం పడుతుంది.

Harvard University: హార్వర్డ్ విశ్వవిద్యాలయంపై ట్రంప్ ఆంక్షలు.. విదేశీ విద్యార్థులకు షాక్..
Trump Administration Harvard University

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (donald trump) కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటూ చర్చనీయాంశంగా మారుతున్నారు. ఈ క్రమంలోనే ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయమైన హార్వర్డ్‌పై (Harvard University) తన వైఖరిని మరింత కఠినతరం చేశారు. ఎలాగంటే ఈ విశ్వవిద్యాలయానికి విదేశీ విద్యార్థులను అనుమతించే హక్కును ట్రంప్ ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో వేలాది విదేశీ విద్యార్థులు ముఖ్యంగా భారతదేశం నుంచి వచ్చిన వందలాది మంది విద్యార్థులు అనిశ్చితిలో పడిపోయారు. ఈ విద్యార్థులు ఇప్పుడు రెండు దారుల్లో ఒకటి ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరో విశ్వవిద్యాలయానికి బదిలీ కావడం లేదా అమెరికాలో తమ చట్టపరమైన స్థితిని కోల్పోవడం వంటివి ఉన్నాయి.


భారతీయ విద్యార్థుల పరిస్థితి

హార్వర్డ్ విశ్వవిద్యాలయం అధికారిక వెబ్‌సైట్ ప్రకారం ప్రతి సంవత్సరం 500 నుంచి 800 మంది భారతీయ విద్యార్థులు, స్కాలర్లు ఈ విశ్వవిద్యాలయంలో భాగమవుతారు. ప్రస్తుతం, 788 మంది భారతీయ విద్యార్థులు హార్వర్డ్‌లో చదువుతున్నారు. ఈ విశ్వవిద్యాలయంలో మొత్తం 6,800 మంది విదేశీ విద్యార్థులు ఉన్నారు. వీరిలో అత్యధికంగా గ్రాడ్యుయేట్ చేస్తున్నారు. ఈ నిర్ణయం వారి విద్యా జీవితంపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఎందుకంటే వారు ఇప్పుడు తమ తదుపరి దశల గురించి ఆలోచించాల్సిన అవసరం ఏర్పడింది.


నిర్ణయం వెనుక కారణాలు

హార్వర్డ్ విశ్వవిద్యాలయం తమ విదేశీ విద్యార్థుల రికార్డులను సమర్పించడానికి నిరాకరించినట్లు తెలిపింది. ఈ చర్యను చట్టవిరుద్ధమని, తమ పరిశోధనా లక్ష్యాలను దెబ్బతీస్తుందని హార్వర్డ్ వెల్లడించింది. ఈ వివాదం హార్వర్డ్‌కు మాత్రమే కాకుండా, అమెరికాలోని ఉన్నత విద్యా వ్యవస్థకు కూడా ఒక సవాలుగా మారిందని చెప్పవచ్చు. మరోవైపు హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నోయెమ్ ఒక లేఖలో, హార్వర్డ్ యూనివర్సిటీ "యూదు విద్యార్థులకు వ్యతిరేకమైన అసురక్షిత క్యాంపస్ వాతావరణాన్ని సృష్టిస్తోందన్నారు. ప్రో-హమాస్ సానుభూతిని ప్రోత్సహిస్తోందని, జాతివివక్షతో కూడిన డైవర్సిటీ, ఈక్విటీ, ఇంక్లూజన్ (DEI) విధానాలను అమలు చేస్తోందని ఆరోపించారు.


ప్రభుత్వానికి ప్రైవేట్ కాలేజీలపై అధికారం ఉందా

అమెరికా ప్రభుత్వానికి దేశంలోకి ఎవరు ప్రవేశించాలనే విషయంపై అధికారం ఉంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ, స్టూడెంట్ ఎక్స్‌ఛేంజ్ అండ్ విజిటర్ ప్రోగ్రామ్ (SEVP)లో భాగమైన కళాశాలలను పర్యవేక్షిస్తుంది. ఈ ప్రోగ్రామ్ ద్వారా విశ్వవిద్యాలయాలు విదేశీ విద్యార్థులకు అడ్మిషన్ డాక్యుమెంటేషన్ జారీ చేసే అధికారం కలిగి ఉంటాయి. ఆ తర్వాత విద్యార్థులు అమెరికాలో చదువుకోవడానికి వీసా కోసం దరఖాస్తు చేస్తారు. గత గురువారం, DHS హార్వర్డ్‌ను ఈ ప్రోగ్రామ్ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది.


ప్రస్తుత విద్యార్థుల పరిస్థితి ఏంటి..

ఈ సెమిస్టర్‌లో తమ డిగ్రీలను పూర్తి చేసిన విద్యార్థులు గ్రాడ్యుయేట్ కావడానికి అనుమతించబడతారు. నోయెమ్ లేఖ ప్రకారం, ఈ మార్పులు 2025-2026 విద్యా సంవత్సరం నుంచి అమలులోకి వస్తాయి. అయితే, ఇంకా తమ డిగ్రీలను పూర్తి చేయని విద్యార్థులు మరో విశ్వవిద్యాలయానికి బదిలీ కావాలి. లేకపోతే వారు అమెరికాలో చట్టపరమైన అనుమతిని కోల్పోతారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే లేదా కోర్టు జోక్యం చేసుకోకపోతే, కొత్త విద్యార్థులు హార్వర్డ్‌లో చేరలేరు.


ఇవీ చదవండి:

బాబోయ్ మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు..

పాకిస్థాన్ ఐఎస్ఐ కుట్రను భగ్నం చేసిన భారత్..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 23 , 2025 | 09:00 AM