British MP: కశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం చెప్పిన బ్రిటీష్ ఎంపీ
ABN , Publish Date - Apr 30 , 2025 | 04:27 PM
భారత్-పాక్ ల మధ్య దశాబ్ధాల నుండి సత్సంబంధాలు లేవు. కశ్మీర్ రూపంలో ఏదో ఒక తలపోటు ఇండియాను పట్టిపీడిస్తోంది. తాజా పహల్గాం ఉదంతంతో దీనికి శాశ్వత పరిష్కారం కోసం..
Lord Meghnad Desai: భారత్-పాక్ ల మధ్య దశాబ్ధాల నుండి సత్సంబంధాలు లేవు. కశ్మీర్ రూపంలో ఏదో ఒక తలపోటు ఇండియాను పట్టిపీడిస్తోంది. తాజా పహల్గాం ఉదంతంతో దీనికి శాశ్వత పరిష్కారం కోసం భారతీయులేకాదు, యావత్ ప్రపంచం కూడా ఎదురు చూస్తోంది. ఈ సమస్యకు భారత సంతతికి చెందిన బ్రిటిష్ ఎంపీ లార్డ్ మేఘనాథ్ దేశాయ్ పరిష్కారం చెప్పారు. కశ్మీర్ వివాదాన్ని పూర్తిగా రూపుమాపాలంటే పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను భారత్ పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని ఆయన భారత ప్రభుత్వానికి సూచించారు. అదొక్కటే అన్ని సమస్యలకు పరిష్కారమార్గమన్నారు. ఉగ్రవాదులను రూపుమాపడానికి, పహల్గాం ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే.. భారత్.. పాక్ ఆక్రమిత కశ్మీర్ స్వాధీన పర్చుకోవాల్సిందేనని ఆయన అన్నారు.
మరో వైపు, పహల్గాం ఉగ్రదాడి ఉగ్రమూకను కఠిన శిక్ష విధించాలని తాము భారత్‌ను కోరుతున్నట్లు బ్రిటన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ పేర్కొనడం మరో విశేషం. ఉగ్రవాద నిర్మూలనలో భారత ప్రభుత్వానికి తాము ఎప్పటికీ అండగా ఉంటామని తెలిపింది. పహల్గాం ఘటనకు వ్యతిరేకంగా ఇటీవల లండన్‌లో భారతీయులు నిరసన చేపడుతున్న సమయంలో అక్కడి పాకిస్థాన్ హైకమిషన్ అధికారి వారిని బెదిరిస్తున్నట్లు ఉన్న వీడియో తమను ఆందోళనకు గురి చేసిందని కూడా మినిస్ట్రీ తెలిపింది. దీనిపై విచారణ జరుపుతున్నామని పేర్కొంది.
ఈ వార్తలు కూడా చదవండి
Cyber Fraud: నయా సైబర్ మోసం.. ఆర్మీ పేరుతో విరాళాలకు విజ్ఞప్తి
మెట్రో స్టేషన్లు, రైళ్లలో.. బెట్టింగ్ యాప్స్ ప్రచారంపై కట్టడి
NHAI: ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగానికి పర్యావరణ అనుమతులు!
Read Latest Telangana News and National News