Share News

Sydney Bondi Shooting: సిడ్నీ కాల్పుల్లో తృటిలో తప్పించుకున్న ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాఘన్

ABN , Publish Date - Dec 14 , 2025 | 09:08 PM

సిడ్నీలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన బాండి బీచ్ లో ఇద్దరు దుండగులు పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పదిమందికి పైగా మృతి చెందారు. ఈ కాల్పుల నుంచి ప్రాణాలతో బయటపడ్డ ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాఘన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Sydney Bondi Shooting: సిడ్నీ కాల్పుల్లో తృటిలో తప్పించుకున్న ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాఘన్
Sydney Bondi Beach Terror Attack

ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో బాండి బీచ్‌ పర్యాటక కేంద్రంగా మంచి గుర్తింపు ఉంది. ఆదివారం బాండి బీచ్‌లో పర్యాటకులపై దుండగులు అతి దారుణంగా కాల్పులు జరిపారు. యూదుల పండుగ మొదటి రోజే ఇలాంటి ఘటన చోటు చేసుకోడం అందరినీ షాక్ కి గురిచేసింది. ముసుగు ధరించి ఇద్దరు దుండగులు దాదాపు 50 రౌండ్ల వరకు కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ ఘటనలో పదిమందికి పైగా మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయాప్డారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కాల్పుల ఘటనలో ఇంగ్లాండ్ క్రికెట్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాఘన్ తృటిలో తప్పించుకున్నారు.


ఈ సందర్భంగా మైఖేల్ వాఘన్ సోషల మీడియాలో ‘ ప్రపంచం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన భయానక దృశ్యాన్ని వర్ణించడానికి మాటలు సరిపోవు. హనుక్కా పండుగను లక్ష్యంగా యూదులపై జరిపిన దాడి దారుణం. మేమంతా ఓ రెస్టారెంట్ లో బంధించబడ్డాం.. ఆ క్షణాలు ఎంతో భయంకరంగా ఉన్నాయి. నేను సురక్షితంగా బయటపడ్డాను. రెస్క్యూ టీమ్, వైద్య బృందాలకు నా ధన్యవాదాలు’ అంటూ రాసుకొచ్చారు. ఇది‌లా ఉంటే ఈ దాడిని ఉగ్రవాద సంఘటనగా ఆస్ట్రేలియా పోలీసులు, నయూ సౌత్ వేల్స్ ప్రీమియర్ క్రిస్ మిన్స్ అభివర్ణించారు. దాడి సమయంలో బీచ్‌లో సుమారు 1000 మంది వరకు ఉత్సవంలో పాల్గొన్నారని ఉంటారని పోలీసులు చెబుతున్నారు.


ఇవీ చదవండి:

అమెరికా యూనివర్సిటీలో కాల్పుల ఘటన.. ఇద్దరి మృతి, 8 మందికి గాయాలు

నిధుల విడుదలకు కఠిన షరతులు.. పాక్‌కు చుక్కలు చూపిస్తున్న ఐఎమ్ఎఫ్

For more international news and telugu news

Updated Date - Dec 14 , 2025 | 09:13 PM