Share News

Gold Production: పాదరసంతో బంగారం!

ABN , Publish Date - Jul 29 , 2025 | 04:31 AM

సిలికాన్‌ వ్యాలీకి చెందిన మారథాన్‌ ఫ్యూజన్‌ అనే స్టార్టప్‌ కంపెనీ సంచలన ప్రకటన చేసింది. పాదరసాన్ని బంగారంగా మార్చే..

Gold Production: పాదరసంతో బంగారం!

  • సిలికాన్‌ వ్యాలీ స్టార్టప్‌ ప్రకటన

  • న్యూక్లియర్‌ ట్రాన్స్‌మ్యుటేషన్‌తో మేలిమి బంగారం తయారీ

శాన్‌ఫ్రాన్సిస్కో, జూలై 28: సిలికాన్‌ వ్యాలీకి చెందిన మారథాన్‌ ఫ్యూజన్‌ అనే స్టార్టప్‌ కంపెనీ సంచలన ప్రకటన చేసింది. పాదరసాన్ని బంగారంగా మార్చే సాంకేతికతను అభివృద్ధి చేశామని వెల్లడించింది. తమ ప్రయోగాలు కార్యరూపు దాలిస్తే.. బంగారం ధరలపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలున్నట్లు తెలిపింది. అయితే.. పాదరసంతో తాము తయారు చేసేది మేలిమి బంగారమే అయినా.. ఫ్యూజన్‌ రియాక్టర్‌ వినియోగం కారణంగా.. 14-18 ఏళ్ల వరకు అందులో రేడియో ధార్మికత ఉండే ప్రమాదముందని.. అప్పటి వరకు దీన్ని వాణిజ్యపరంగా వినియోగించేందుకు అవకాశముండదని స్పష్టం చేసింది. పాదరసం-198 అనే ఐసోటోప్ తొలుత పాదరసం-197గా మార్చాల్సి ఉంటుందని, ఆ తర్వాత దాన్ని బంగారం-197 ఐసోటోప్ గా రూపాంతరం చెందేలా చేయవచ్చని మారథాన్‌ ఫ్యూజన్‌ వెల్లడించింది. మూలకాల మార్పిడి(న్యూక్లియర్‌ ట్రాన్స్‌మ్యుటేషన్‌) ద్వారా ఇది సాధ్యమని పేర్కొంది. ఈ ప్రక్రియ ద్వారా ఏటా 5 వేల కిలోల మేర బంగారాన్ని ఉత్పత్తి చేయవచ్చని తెలిపింది. మారథాన్‌ ఫ్యూజన్‌ స్టార్టప్‌ ఇప్పటి వరకు 6 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు, 4 మిలియన్‌ డాలర్ల ప్రభుత్వ నిధులను సాధించడం గమనార్హం..!


ఇవి కూడా చదవండి..

22 నిమిషాల్లో ఆపరేషన్ సిందూర్ పూర్తి చేశాం: రాజ్‌నాథ్

పహల్గాం దాడికి అమిత్‌షా బాధ్యత తీసుకోవాలి: గౌరవ్ గొగోయ్

For More National News and Telugu News..

Updated Date - Jul 29 , 2025 | 07:02 AM