Israel Embassy: అమెరికాలో ఇజ్రాయెలీల కాల్చివేత
ABN , First Publish Date - 2025-05-23T04:38:05+05:30 IST
వాషింగ్టన్ డీసీలో ఇజ్రాయెల్ ఎంబసీ సిబ్బందిపై దాడి జరిగి ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనపై ప్రపంచ దేశాలు తీవ్రంగా స్పందించాయి, నిందితుడు "ఫ్రీ పాలస్తీనా" నినాదాలతో అరెస్టయ్యాడు.
యూదు మ్యూజియం వద్ద ఘటన
మృతులిద్దరూ కాబోయే దంపతులు..
దుండగుడిని అరెస్టు చేసిన పోలీసులు
పాలస్తీనా విమోచన కోసం నినాదాలు
భారత్ సహా ప్రపంచ దేశాల ఖండన
వాషింగ్టన్, మే 22: అమెరికాలో ఇజ్రాయెల్ ఎంబసీ సిబ్బందిపై కాల్పులు జరపడంతో ఇద్దరు మరణించారు. వాషింగ్టన్ డీసీలోని యూదు మ్యూజియం వద్ద బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. మృతులను యరాన్ లిస్చింస్కీ, సారా మిల్‌గ్రిమ్‌గా గుర్తించారు. వీరు యూదు మ్యూజియంలో ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి వెళ్తుండగా దుండగుడు వీరి సమీపానికి వచ్చి కాల్పులు జరిపాడు. అనంతరం దుండగుడు నడుచుకుంటూ మ్యూజియంలోకి వెళ్లిపోయాడు. అక్కడి భద్రతా సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా నిందితుడు ‘ఫ్రీ..ఫ్రీ..పాలస్తీనా’ అంటూ నినాదాలు చేశాడు. నిందితుడిని షికాగోకు చెందిన ఇలియాస్ రోడ్రిగూజ్(30)గా గుర్తించారు. లిస్చింస్కీ, మిల్‌గ్రిమ్ ప్రేమజంట అని, త్వరలో పెళ్లి బంధంతో ఒక్కటవ్వాలనుకున్నారని అమెరికాలోని ఇజ్రాయెల్ రాయబారి యెచీల్ లీటెర్ తెలిపారు. వచ్చేవారం జెరూసలెంలో వారి నిశ్చితార్థ కార్యక్రమం జరగాల్సి ఉందన్నారు. ఈ ఘటనను భారత్ సహా ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ‘యూదులకు వ్యతిరేకంగా ఇలాంటి భయంకరమైన హత్యలకు ముగింపు పలకాలి. అమెరికాలో విద్వేషాలకు, రాడికలిజానికి స్థానం లేదు’ అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భారత రాయబార కార్యాలయ సిబ్బందిని బహిష్కరించిన పాక్
For National News And Telugu News