Share News

Trump Justifies Tariff Policy : ట్రేడ్ టారిఫ్‌లతో ఏడు యుద్ధాలు ఆపేశా.. కంగారు పడుతున్న ట్రంప్!

ABN , Publish Date - Sep 03 , 2025 | 07:38 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత్‌‌‌తో వ్యవహరించిన వైఖరితో ఆయన గొయ్యి ఆయనే తవ్వుకున్నట్టు కనిపిస్తోంది. తన టారిఫ్స్ తెచ్చిన చిక్కుల్ని, స్వదేశంలో వస్తున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు ట్రంప్ పలుమార్లు తన స్వంత డప్పు కొట్టుకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి.

Trump Justifies Tariff Policy : ట్రేడ్ టారిఫ్‌లతో ఏడు యుద్ధాలు ఆపేశా.. కంగారు పడుతున్న ట్రంప్!
Trump justifies tariff policy

ఇంటర్నెట్ డెస్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత్‌‌‌తో వ్యవహరించిన వైఖరితో ఆయన గొయ్యి ఆయనే తవ్వుకున్నట్టు కనిపిస్తోంది. తన టారిఫ్స్ తెచ్చిన చిక్కుల్ని, స్వదేశంలో వస్తున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు ట్రంప్ పదే పదే తన స్వంత డప్పు కొట్టుకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. తాజాగా నిన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్ట్ ట్రంప్.. తన ట్రేడ్ టారిఫ్స్‌ను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. టారిఫ్స్‌ను అంతిమ యుద్ధ పరిష్కారి 'వార్ సెటిలర్ 'గా అభివర్ణిస్తూ, ఇది వాషింగ్టన్‌కు 'గొప్ప చర్చల సామర్థ్యాన్ని' అందిస్తుందని పేర్కొన్నారు.


యుఎస్ స్పేస్ కమాండ్ ప్రధాన కార్యాలయాన్ని అలబామాలోని హంట్స్‌విల్లేకు తరలిస్తున్నట్లు ప్రకటించినప్పుడు ట్రంప్ విలేకరులతో మాట్లాడారు. సుంకాలను మాయా చర్చల సాధనంగా అభివర్ణించారు. సుంకాలు US ఆర్థిక వ్యవస్థను పెంచడమే కాకుండా ఏడు యుద్ధాలను పరిష్కరించడానికి కూడా సహాయపడ్డాయని చెప్పుకొచ్చారు. అదే సమయంలో తన సుంకాల విధానాన్ని సమర్థించుకోవడానికి బైడెన్ పరిపాలనపై ట్రంప్ మరో దాడి చేశారు.


'యునైటెడ్ స్టేట్స్ లేకుండా, ప్రపంచంలోని ఏదీ మనజాలదు. ఇది నిజం. ఇది చాలా శక్తివంతమైంది.. చాలా పెద్దది. నేను మొదటి నాలుగు సంవత్సరాలలో దానిని నిజంగా పెద్దదిగా చేశా. తరువాత ఈ బైడెన్ పరిపాలన చేసిన దానితో అది క్షీణించడం ప్రారంభమైంది. కానీ మనం ఇంత త్వరగా చేరుకోగలమని నేను ఎప్పుడూ అనుకోని స్థాయికి మనం దానిని నిర్మించాం. మేము అత్యంత హాటెస్ట్. మేము ఉత్తములం. మేము ఆర్థికంగా ఉత్తములం. సుంకాలు, ఇతర విషయాల వల్ల వచ్చే డబ్బు చాలా ఎక్కువ. అంతేకాకుండా, ఇది మమ్మల్ని గొప్ప సంధానకర్తలుగా చేస్తుంది' అని అమెరికా అధ్యక్షుడు ఢంకా బజాయించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బంగారం ధరలు మరింత పైకి.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

జూబ్లీహిల్స్‌లో 3,92,669 మంది ఓటర్లు

Read Latest Telangana News and National News

Updated Date - Sep 03 , 2025 | 07:48 AM