Share News

Saudi Arabia: 5,000 మందికి పైగా పాకిస్తానీ యాచకులను బహిష్కరించిన సౌదీ అరేబియా

ABN , Publish Date - May 16 , 2025 | 02:34 PM

గత 16 నెలల్లో సౌదీ అరేబియా మొత్తం 5,033 మంది పాకిస్తానీ యాచకులను బహిష్కరించిందని పాకిస్తాన్ అంతర్గత మంత్రి మొహ్సిన్ నఖ్వీ ఆ దేశ అసెంబ్లీలో తెలిపారు.

Saudi Arabia: 5,000 మందికి పైగా  పాకిస్తానీ యాచకులను బహిష్కరించిన సౌదీ అరేబియా

పాకిస్తాన్‌లో ఇతర ఏజెంట్లలానే కొందరు భిక్షాటన కోసం వ్యక్తులను ఇతర దేశాలకు పంపిస్తారు. నిజానికి కూలి పని కోసం వెతికే వారిని ఏజెంట్లు టార్గెట్ చేస్తారు. అయితే, ఏ పనీ దొరకనప్పుడు వీరిని భిక్షాటన వైపు మళ్లిస్తుంటారు. ఇలా వేల మందిని ఇతర దేశాలకు తరలిస్తుంటారు. అయితే, ఈ విషయంపై అలర్ట్ అయిన సౌదీ అరేబియా గత 16 నెలల్లో మొత్తం 5,033 మంది పాకిస్తానీ యాచకులను బహిష్కరించింది. ఈ విషయం పాకిస్తాన్ అంతర్గత మంత్రి మొహ్సిన్ నఖ్వీ ఆ దేశ అసెంబ్లీలో తెలిపారు.

5,033 మంది పాకిస్తానీ యాచకులు బహిష్కరణ

16 నెలల వ్యవధిలో మొత్తం 5,033 మంది పాకిస్తానీ యాచకులను సౌదీ అరేబియా నుండి బహిష్కరించినట్లు అంతర్గత మంత్రి మొహ్సిన్ నఖ్వీ అసెంబ్లీలో తెలిపారు. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పిపిపి) ఎంఎన్ఎ సెహర్ కమ్రాన్ లేవనెత్తిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా నఖ్వీ ఈ వ్యాఖ్యలు చేసినట్లు డాన్ పత్రిక నివేదించింది.


ప్రధానంగా పశ్చిమాసియాలోని మరో ఐదు దేశాలలో భిక్షాటన చేస్తున్నందుకు మరో 369 మందిని అరెస్టు చేసినట్లు నఖ్వీ పేర్కొన్నారు. మంత్రి అందించిన డేటా ప్రకారం జనవరి 2024 నుండి సౌదీ అరేబియా, ఇరాక్, మలేషియా, ఒమన్, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) నుండి మొత్తం 5,402 మంది పాకిస్తానీయులను బహిష్కరించారు.

కమ్రాన్ గత మూడు సంవత్సరాల డేటాను కోరగా మంత్రి జనవరి 2024 నుండి సంబంధించిన వివరాలను అందించారు. ఈ దేశాల నుండి బహిష్కరించబడిన వారిలో ఎక్కువ మంది సింధ్ ప్రావిన్స్‌కు చెందినవారని డేటాలో తేలింది. డాన్ పత్రిక ప్రకారం, భిక్షాటన ఆరోపణలపై ఈ దేశాల నుండి బహిష్కరించబడిన వారిలో ప్రావిన్స్ నుండి మొత్తం 2,795 మంది ఉన్నారు. అయితే పంజాబ్‌కు చెందిన వారి సంఖ్య 1,437గా ఉంది.

డేటా ప్రకారం, బహిష్కరించబడిన వారిలో 1,002 మంది ఖైబర్ పఖ్తుంఖ్వా నుండి, 125 మంది బలూచిస్తాన్ నుండి, 33 మంది ఆజాద్ కాశ్మీర్ నుండి, 10 మంది ఇస్లామాబాద్ నుండి వచ్చారు. సౌదీ అరేబియా 247 మంది పాకిస్తానీయులను స్వదేశానికి తిరిగి పంపించింది. పాకిస్తాన్ తరచు తమ యాచకులను తమ దేశానికి పంపిస్తుందని గమనించిన సౌదీ అరేబియా పాకిస్తాన్ జాతీయులకు వీసాలపై యుఎఇ కఠినమైన ఆంక్షలు విధించింది. అన్ని చర్యలు తీసుకున్నప్పటికీ, పాక్ యాచకులు మాత్రం వారి దేశంలో తగ్గడం లేదు.


Also Read:

Rajnath Singh: ఆపరేషన్ సిందూర్ ముగియలేదు.. తేల్చేసిన రాజ్‌నాథ్ సింగ్

Elephant Sad Video: అయ్యో.. ఈ ఏనుగుకు ఎంత కష్టమొచ్చిందీ.. రోడ్డుపై ట్రక్కు వద్ద ఏం చేస్తుందో చూస్తే..

ndian Army Encounter: పల్వామాలో ఎన్‌కౌంటర్.. 48 గంటల్లో ఆరుగురు ఉగ్రవాదుల హతం..

Updated Date - May 16 , 2025 | 02:34 PM