Bondi Beach Shooting: సిడ్నీ బీచ్‌లో మారణకాండ.. ఆ ఇద్దరు ఉగ్రవాదులు పాకిస్థాన్ వారే?..
ABN , Publish Date - Dec 15 , 2025 | 12:05 PM
పోలీసు అధికారులు బోండి బీచ్‌లో మారణకాండకు పాల్పడ్డ ఆ దుర్మార్గులను తండ్రీ కొడుకులుగా గుర్తించారు. 50 ఏళ్ల సాజిద్ అక్రమ్, 24 ఏళ్ల నవీద్ అక్రమ్‌లు ఈ దాడికి పాల్పడ్డారు. సాజిద్ పోలీసుల కాల్పుల్లో అక్కడికక్కడే చనిపోయాడు. ప్రస్తుతం దాడులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
సిడ్నీ నగరంలోని ప్రఖ్యాత బోండి బీచ్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మారణహోమం సృష్టించిన సంగతి తెలిసిందే. ‘హనూకా’ వేడుకల్లో పాల్గొన్న వందలాది మంది యూదులపై నలుపురంగు దస్తులు ధరించిన దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 16 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. సుమారు ఏడు నిమిషాలపాటు మారణహోమం జరిగింది. ఈ క్రమంలో ఓ వ్యక్తి ధైర్యంగా ఓ ఉగ్రవాదితో కలబడి తుపాకీ లాక్కున్నాడు. లేదంటే మరింత మంది ప్రాణాలు పోయేవి. బోండి బీచ్‌లో జరిగింది ఉగ్రదాడేనని న్యూసౌత్‌వేల్స్ పోలీస్ కమిషనర్ మాల్ లన్యన్ ప్రకటించారు. తనిఖీల్లో ఉగ్రవాదులకు చెందిన కారులో ఒక బాంబు, పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.
తండ్రీ కొడుకులది పాకిస్థాన్ ?...
బోండి బీచ్‌లో మారణకాండకు పాల్పడ్డ ఆ దుర్మార్గులను తండ్రీ కొడుకులుగా గుర్తించారు. 50 ఏళ్ల సాజిద్ అక్రమ్, 24 ఏళ్ల నవీద్ అక్రమ్‌లు ఈ దాడికి పాల్పడ్డారు. సాజిద్ పోలీసుల కాల్పుల్లో అక్కడికక్కడే చనిపోయాడు. నవీద్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని మాల్ లాన్‌యాన్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అంతర్జాతీయ మీడియా సంస్థ సీబీఎస్ కథనం ప్రకారం.. ఆ ఇద్దరు పాకిస్తాన్ మూలూలు కలిగిన వ్యక్తులుగా తెలుస్తోంది. నవీద్ అక్రమ్‌కు సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ పోలీసులకు లభించింది. అందులో నవీద్ డేట్ ఆఫ్ బర్త్ 2001, ఆగస్టు 12వ తేదీ అని ఉంది. అంతేకాదు.. డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఇచ్చిన ఫొటోలో అతడు పాకిస్థాన్ క్రికెట్ టీమ్ ధరించే టీషర్ట్‌ను పోలివున్న టీషర్ట్ ధరించాడు.
అతి క్రూరంగా కాల్పులు..
ఇద్దరు దుర్మార్గులు అత్యంత క్రూరంగా బీచ్‌లోని వారిపై దాడులకు పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఓ వీడియోలో నవీద్ ఎంతో స్పీడుగా తుపాకీని ఆపరేట్ చేస్తూ కాల్పులకు పాల్పడుతూ ఉన్నాడు. రెండు వైపులకు తిరిగి మరీ కాల్పులు జరిపాడు. ఒక మధ్యవయస్కుడైన ఆస్ట్రేలియన్ వ్యక్తి తన ప్రాణాలను పణంగాపెట్టి ఒక ఉగ్రవాదిని పట్టుకుని తుపాకీని బలవంతంగా లాక్కొని, అనేకమంది ప్రాణాలను కాపాడాడు. దీనికి సంబంధించిన వీడియో ఫుటేజ్‌లో ఈ ధీశాలి ధైర్యసాహసాలు కళ్లకుకట్టినట్టు కనిపించాయి.
ఇవి కూడా చదవండి
దేవుడా.. మరింతగా క్షీణించిన రూపాయి
ఆధునాతనంగా మోడల్ పోలీస్‌స్టేషన్‌ల నిర్మాణం: హోంమంత్రి అనిత