Russia Ukraine conflict: ఉక్రెయిన్‌పై 273 డ్రోన్లతో దాడి
ABN , Publish Date - May 19 , 2025 | 05:24 AM
ఉక్రెయిన్‌పై రష్యా 273 డ్రోన్లతో భారీ దాడులు నిర్వహించింది, ఒక మహిళ మరణించి ముగ్గురు గాయపడ్డారు. ఇస్తాంబుల్‌లో జరిగిన శాంతి చర్చలు విఫలమైన తర్వాత ఈ దాడులు జరిగాయి, పైగా పుతిన్, జెలెన్‌స్కీ మధ్య ఫోన్ సంభాషణ జరగనున్నది.

కివ్, మే 18: ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి భారీ స్థాయిలో 273 డ్రోన్లతో దాడులకు తెగబడింది. డ్రోన్లతో ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాలపై దాడులు చేసింది. ఈ దాడుల వల్ల ఒక మహిళ మృతి చెందగా.. మరో ముగ్గురు గాయాలపాలయ్యారు. 2022లో పూర్తి స్థాయి యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఈ స్థాయిలో భారీ డ్రోన్ దాడి జరగలేదని తెలుస్తోంది. కాల్పుల విరమణ దిశగా మాస్కో, కివ్ మధ్య మొదటిసారి ఇస్తాంబుల్ వేదికగా జరిగిన ముఖాముఖి చర్చలు విఫలమైన నేపథ్యంలో ఈ దాడులు చోటు చేసుకున్నాయి. మరోవైపు ఉక్రెయిన్ కూడా రష్యాలపై డ్రోన్లను ప్రయోగించింది. ఇదిలా ఉండగా.. యుద్ధానికి ముగింపు పలకడానికి గాను సోమవారం రష్యా అధ్యక్షుడు పుతిన్, తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ఫోన్‌లో మాట్లాడనున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.
ఇవీ చదవండి:
పాక్ చేసే తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు.. తుర్కియేకు అసదుద్దీన్ ఒవైసీ సూచన..
మానవాళికి ముప్పుగా మారిన పాక్.. నిప్పులు చెరిగిన ఒవైసీ
భారత్ దాడి చేసిందని ఆర్మీ చీఫ్ ఫోన్ చేశాడు.. నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని..
ఇద్దరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులను అరెస్టు చేసిన ఎన్ఐఏ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి