Share News

Ukraine war: ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణకు రెడీ

ABN , Publish Date - May 20 , 2025 | 04:42 AM

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఉక్రెయిన్‌ యుద్ధానికి చరమ గీతం పాడేందుకు సిద్ధమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తెలిపారు. రెండు దేశాలు కాల్పుల విరమణ కోసం చర్చలు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

Ukraine war: ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణకు రెడీ

ట్రంప్‌తో 2 గంటల ఫోన్‌ చర్చల తర్వాత వెల్లడి

తక్షణం పుతిన్‌, జెలెన్‌స్కీ మధ్య ప్రారంభం కానున్న చర్చలు

మాస్కో/ వాషింగ్టన్‌ డీసీ, మే 19: ఉక్రెయిన్‌తో రెండేళ్లకు పైగా సాగుతున్న యుద్ధానికి ఎట్టకేలకు చరమ గీతం పాడేందుకు సిద్ధమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అంగీకరించారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. కాల్పుల విరమణకు తక్షణం రష్యా, ఉక్రెయిన్‌ చర్చలు ప్రారంభిస్తాయని, ఆ రెండు దేశాల అధినేతల మధ్య జరిగే సంప్రదింపుల్లో షరతులు ఖరారవుతాయని పేర్కొన్నారు. ఈ విషయమై పుతిన్‌తో ట్రంప్‌ సోమవారం రెండు గంటలకు పైగా ఫోన్‌లో చర్చించారు. యుద్ధం అనంతర పరిణామాలపై అగ్రదేశాల నేతలిరువురు చర్చించుకున్నారు.


ఇవీ చదవండి:

Operation Sindoor: మౌనం విపత్కరం.. జైశంకర్‌పై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు, బీజేపీ కౌంటర్

భారత్ దాడి చేసిందని ఆర్మీ చీఫ్ ఫోన్ చేశాడు.. నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని..

ఇద్దరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులను అరెస్టు చేసిన ఎన్ఐఏ

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 20 , 2025 | 04:45 AM