Share News

PM Modi Putin dinner: రష్యా అధ్యక్షుడికి స్వయంగా స్వాగతం పలికిన ప్రధాని మోదీ.. ప్రైవేట్ డిన్నర్..

ABN , Publish Date - Dec 04 , 2025 | 07:37 PM

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండ్రోజుల పర్యటన నిమిత్తం కొద్ది సేపటి క్రితం దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ సమీపంలోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో దిగిన పుతిన్‌కు ప్రధాని మోదీ స్వయంగా స్వాగతం పలికారు.

PM Modi Putin dinner: రష్యా అధ్యక్షుడికి స్వయంగా స్వాగతం పలికిన ప్రధాని మోదీ.. ప్రైవేట్ డిన్నర్..
PM Modi Putin dinner

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండ్రోజుల పర్యటన నిమిత్తం కొద్ది సేపటి క్రితం దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ సమీపంలోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో దిగిన పుతిన్‌కు ప్రధాని మోదీ స్వయంగా స్వాగతం పలికారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత పుతిన్ భారత్‌లో పర్యటించడం ఇదే ప్రథమం. చివరిగా నాలుగేళ్ల క్రితం పుతిన్ భారత్‌లో పర్యటించారు (India Russia summit 2025).


ఈ రోజు సాయంత్రం ప్రధాని మోదీ ఆయనకు ప్రైవేట్ విందు ఇస్తారు. గతేడాది జులైలో ప్రధాని మోదీ మాస్కో పర్యటన సందర్భంగా పుతిన్ కూడా ఇలాగే ప్రైవేట్ విందు ఏర్పాటు చేశారు. కాగా, శుక్రవారం 23వ భారత్-రష్యా శిఖరాగ్ర సమావేశం జరగనుంది. ఈ శిఖరాగ్ర సమావేశం తర్వాత పుతిన్.. రష్యన్ ప్రభుత్వ ప్రసార సంస్థ ఆర్‌టీ కొత్త ఇండియా ఛానెల్‌ను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము నిర్వహించే విందులో పాల్గొంటారు (Modi Putin meeting).


భారత్‌తో సంబంధాలు, సహకారాన్ని మరింత పెంపొందించుకోవడానికి రష్యా ఎదురుచూస్తోందని ఇప్పటికే రష్యా అధ్యక్షుడు ప్రకటించారు (Putin arrives in India). ఈ సమావేశంలో భాగంగా ఇరు దేశాల మధ్య ఇంధనం, పరిశ్రమలు, అంతరిక్షం, వ్యవసాయం తదితర రంగాల్లో ఉమ్మడి ప్రాజెక్టులను చేపట్టి వాటిని పూర్తి చేసుకోవడమే లక్ష్యంగా ఇరు దేశాలు చర్యలు తీసుకోబోతున్నాయి. అలాగే భారత్ నుంచి దిగుమతులను పెంచుకోవాలనే యోచనలో కూడా రష్యా ఉన్నట్టు తెలుస్తోంది.


ఇవీ చదవండి:

కూలిన అమెరికా ఎఫ్-16సీ ఫైటర్ జెట్.. పైలట్ సేఫ్

తీరు మార్చుకోని పాక్.. భారత గగనతలంలోకి విమానాలను అనుమతించినా..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 04 , 2025 | 07:37 PM