US Universities: భారత్‌లో మీ క్యాంప్‌సలు తెరవండి
ABN , Publish Date - Feb 15 , 2025 | 05:17 AM
తమ విద్యాసంస్థల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడానికి, విదేశీ విద్యను సులభతరం చేయడానికి, మనదేశంలో అమెరికా విశ్వవిద్యాలయాల క్యాంప్‌సలను నెలకొల్పే అవకాశాలను పరిశీలించడానికి భారత్-అమెరికా దేశాలు అంగీకరించాయి.

అమెరికా వర్సిటీలకు మోదీ ఆహ్వానం
వాషింగ్టన్, ఫిబ్రవరి 14: భారత్‌లో క్యాంప్‌సలను తెరవాలంటూ అమెరికాలోని విశ్వవిద్యాలయాలకు మోదీ ఆహ్వానం పలికారు. తద్వారా భారతీయ విద్యార్థులకు స్వదేశంలోనే నాణ్యమైన విద్యావకాశాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. తమ విద్యాసంస్థల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడానికి, విదేశీ విద్యను సులభతరం చేయడానికి, మనదేశంలో అమెరికా విశ్వవిద్యాలయాల క్యాంప్‌సలను నెలకొల్పే అవకాశాలను పరిశీలించడానికి భారత్-అమెరికా దేశాలు అంగీకరించాయి. గురువారం వైట్‌హౌ్‌సలో ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య జరిగిన సుదీర్ఘ చర్చల్లో భాగంగా విద్యార్థులు, పరిశోధకులు, ఉద్యోగుల రాకపోకల కారణంగా ఇరుదేశాలూ లబ్ధిపొందాయని గుర్తించారు. ‘ఓపెన్ డోర్స్’ నివేదిక ప్రకారం.. ఉన్నత విద్య కోసం అమెరికా వెళుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య ఏటికేడు పెరుగుతోంది. 2023-24 విద్యాసంవత్సరంలో అమెరికాలో చదువుకుంటున్న భారతీయుల సంఖ్య 3,31,602. ఇది 2022-23 విద్యాసంవత్సరంతో పోల్చితే 23శాతం ఎక్కువ. ఆ సంవత్సరంలో ఈసంఖ్య 2,68,923 మాత్రమే! ఇరుదేశాల ప్రజల మధ్య సంబంధాలకు ప్రాముఖ్యత ఉందనే విషయాన్ని నొక్కి చెబుతూ.. 3లక్షలకు పైగా భారతీయ విద్యార్థుల కారణంగా.. ప్రతి ఏడాది అమెరికా ఆర్థిక వ్యవస్థకు 8 బిలియన్ డాలర్ల మేర లబ్ధి కలుగుతోందని, ఫలితంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా భారీస్థాయిలో ఉద్యోగాల కల్పనకు అవకాశం కలుగుతోందని ఇరుదేశాధినేతలు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
PM Modi: ప్రధాని మోదీ డొనాల్డ్ ట్రంప్ సమావేశం.. అక్రమ వలసదారుల విషయంపై మోదీ కీలక వ్యాఖ్యలు
CEC: కొత్త సీఈసీ ఎంపికకు కసరత్తు.. 18న రాజీవ్ కుమార్ పదవీవిరమణ
Chennai: కమల్‌హాసన్‌తో ఉప ముఖ్యమంత్రి భేటీ..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.