PM Modi Calls to Trump: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు ప్రధాని మోదీ ఫోన్
ABN , Publish Date - Dec 11 , 2025 | 07:53 PM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటన తర్వాత.. ట్రంప్‌నకు ఇలా ప్రధాని ఫోన్ చేయడంపై సర్వత్రా ఆసక్తి రేపుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump)నకు భారత ప్రధాని మోదీ(PM Modi) ఫోన్ చేశారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలపై ఇరువురు నేతలూ చర్చించినట్టు తెలుస్తోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్(Russia President Putin) భారత పర్యటన తర్వాత.. ట్రంప్‌నకు మోదీ ఫోన్ చేయడంపై సర్వత్రా ఆసక్తి రేపుతోంది(Modi calls Trump).
భారత్-అమెరికాల మధ్య వాణిజ్య సంబంధాలు(Trade Relations), ప్రపంచ పరిణామాల(Global developments)పై ట్రంప్‌తో మోదీ మాట్లాడినట్టు సమాచారం. అలాగే ఇరుదేశాల వ్యూహాత్మక భాగస్వామ్యంపై కూడా ఇరు నేతలూ చర్చించినట్టు తెలుస్తోంది. వ్యాపారం, సాంకేతికత, రక్షణ, భద్రత రంగాల్లో సహకారంపై సంభాషణ జరిగినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అయితే.. రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటన ముగిసిన రోజుల వ్యవధిలోనే మోదీ ట్రంప్‌తో ఫోన్ చేసి మాట్లాడటంపై సర్వత్రా చర్చనీయాంశమైంది.
ఇవీ చదవండి:
వైట్ హౌస్ ప్రెస్ సెక్రెటరీపై అధ్యక్షుడు ట్రంప్ పొగడ్తలు.. ఆమె సూపర్ స్టార్ అంటూ..
మన దేశానికి రష్యా అధ్యక్షులెవరూ ఇందుకే రారు.. పాక్ జర్నలిస్టు ఆవేదన