Masood Azhar compensation: మసూద్ అజర్‌కు రూ.14 కోట్ల పరిహారం
ABN , Publish Date - May 15 , 2025 | 04:33 AM
ఇండియా క్షిపణి దాడుల్లో మసూద్ అజర్ కుటుంబ సభ్యులైన 14 మంది మృతి చెందడంతో పాకిస్థాన్ ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.కోటి పరిహారం ప్రకటించింది. దీనిపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న పాక్ ప్రభుత్వం, ధ్వంసమైన ఇళ్లను పునర్నిర్మించనుందని ప్రకటించింది.
ఇస్లామాబాద్, మే 14: జైషే మహ్మద్ చీఫ్, ఐరాస అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన మసూద్ అజర్‌కు పాకిస్థాన్ సర్కారు రూ.14 కోట్ల పరిహారం ఇవ్వనుంది. పాక్‌లోని ఉగ్రస్థావరాలపై భారత్ చేసిన క్షిపణి దాడుల్లో మసూద్ అజర్ కుటుంబ సభ్యులు 14 మంది హతమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మృతులు ఒక్కొక్కరికి పాక్ ప్రభుత్వం రూ.కోటి చొప్పున పరిహారం ప్రకటించినట్లు ‘ద ట్రైబ్యూన్ ఇండియా’ కథనంలో పేర్కొంది. మృతుల వారసులకు ఈ సొమ్మును అందించనున్నారని.. ఒకవేళ అజర్ తానే వారసుడినని ప్రకటించుకుంటే మొత్తం డబ్బు అతనికే ఇస్తారని తెలిపింది. పరిహారంతో పాటు భారత్ దాడుల్లో ధ్వంసమైన ఇళ్లను కూడా పునర్నిర్మిస్తామని పాక్ సర్కారు పేర్కొన్నట్లు వెల్లడించింది. ఈ చర్యలతో పాకిస్థాన్ ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
Operation Sindoor: మసూద్ అజార్‌కు రూ. 14 కోట్లు చెల్లించనున్న పాక్
Donald Trump: అమెరికాకు సౌదీ బహుమతి.. స్పందించిన ట్రంప్
Teachers in Class Room: క్లాస్ రూమ్‌లోనే దుకాణం పెట్టిన హెడ్ మాస్టర్లు.. వీడియో వైరల్
For AndhraPradesh News And Telugu News