Shehbaz Sharif: భారత్‌ను ఓడించకపోతే నా పేరు షెహబాజే కాదు!
ABN , Publish Date - Feb 25 , 2025 | 04:39 AM
భారత్‌ను ఆర్థికంగా, అభివృద్ధిపరంగా ఓడించకపోతే తనను షెహబాజ్ ఫరీఫ్ అన్న పేరుతో పిలవద్దన్నారు. పంజాబ్ ప్రావిన్స్‌లోని డేరా ఘాజీ ఖాన్‌లో ఇటీవల జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
మా అన్న మీద ఒట్టేసి చెబుతున్నా
బహిరంగ సభలో పాక్ ప్రధాని వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: బహిరంగ సభల్లో అత్యుత్సాహంతో ప్రసంగిస్తారన్న పేరున్న పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్.. తాజాగా తన పేరునే మార్చుకుంటానంటూ ప్రతిజ్ఞ చేసే స్థాయిలో ఉపన్యాసం ఇచ్చారు. భారత్‌ను ఆర్థికంగా, అభివృద్ధిపరంగా ఓడించకపోతే తనను షెహబాజ్ ఫరీఫ్ అన్న పేరుతో పిలవద్దన్నారు. పంజాబ్ ప్రావిన్స్‌లోని డేరా ఘాజీ ఖాన్‌లో ఇటీవల జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. పిడికిలి పైకెత్తడం, గాలిలో చేతులు ఊపడం, వేదికమీద గెంతడం, ఛాతీపై కొట్టుకోవడం, పోడియం డెస్కును కొట్టడం వంటి విన్యాసాలు ప్రదర్శించారు. సామాన్యుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కఠోరంగా శ్రమిస్తోందని చెబుతూ ‘‘పాకిస్థాన్ పరిస్థితిని మెరుగు పరిచేందుకు రాత్రింబవళ్లు కష్టపడుతున్నాం.
పరమాత్మ ఆశీస్సులు ఎల్లప్పుడూ పాకిస్థాన్‌కు ఉన్నాయి’’ అని చెబుతూ ఆకస్మాత్తుగా తన ప్రసంగాన్ని భారత్‌వైపు మళ్లించారు. ‘‘మనందరి కృషి కారణంగా అభివృద్ధి, పురోగతి విషయంలో భారత్ మనకన్నా వెనుకన ఉండకపోతే నా పేరు షెహబాజ్ షరీఫ్ కాదు’’ అని అన్నారు. తన పెద్దన్న పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీ్‌ఫపై ప్రమాణం చేసి ఈ విషయాన్ని చెబుతున్నానని పేర్కొన్నారు. ఈ ప్రసంగం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో విమర్శలు వెల్లువెత్తాయి. క్షేత్రస్థాయిలో ఎలాంటి ప్రగతి లేకున్నా పెద్దపెద్ద వాగ్దానాలు చేస్తున్నారని పలువురు విమర్శించారు. ’
ఇవి కూడా చదవండి..
Thackeray Brothers: దగ్గరవుతున్న థాకరేలు.. పెళ్లి వేడుకలో మళ్లీ కలుసుకున్న సోదరులు
Congress: బీజేపీని ఎలా ఎదుర్కొందాం?
Tamil Nadu: పొల్లాచ్చి రైల్వేస్టేషన్‌లో హిందీ నేమ్ బోర్డుకు తారు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.