Pakistan Navy missile test: యాంటీ-షిప్ బాలిస్టిక్ మిసైల్ ప్రయోగించిన పాకిస్థాన్..
ABN , Publish Date - Nov 26 , 2025 | 09:26 PM
యాంటీ-షిప్ బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినట్టు పాకిస్థాన్ మిలిటరీ విభాగం ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ వెల్లడించింది. ఈ ప్రయోగం విజయవంతమైందని తెలిపింది. ఈ మిసైల్ భూమిపైన, సముద్రంలోని లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ఛేదించగలదని వెల్లడించింది.
యాంటీ-షిప్ బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినట్టు పాకిస్థాన్ మిలిటరీ విభాగం ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ వెల్లడించింది. ఈ ప్రయోగం విజయవంతమైందని తెలిపింది. ఈ మిసైల్ భూమిపైన, సముద్రంలోని లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ఛేదించగలదని వెల్లడించింది. దేశీయంగా అభివృద్ధి చేసిన మిసైల్‌ను షిప్ నుంచి ప్రయోగించి పరీక్షించినట్టు తెలిపింది (ship-launched ballistic missile).
ఈ ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో శాస్త్రవేత్తలకు పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ అభినందనలు తెలియజేశారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో సాగిన ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్ తన రక్షణ రంగ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తోంది (indigenous anti-ship missile).
సెప్టెంబర్‌లో కొత్తగా అభివృద్ధి చేసిన ఫతా-4 క్రూయిజ్ క్షిపణిని ప్రయోగాత్మకంగా పరీక్షించింది (Pakistan defense news). ఈ క్షిపణి రేంజ్ 700 కిలోమీటర్లు. ఇది క్షిపణి రక్షణ వ్యవస్థలను దాటుకుని తక్కువ ఎత్తు లక్ష్యాలను ఛేదిస్తుందని ఆ సమయంలో పాకిస్థాన్ వెల్లడించింది.
ఇవి కూడా చదవండి..
క్రిప్టో పెట్టుబడులతో నష్టాలు.. ట్రంప్ కుటుంబ ఆస్తుల విలువ ఢమాల్
కెనడా పౌరసత్వ చట్టంలో సవరణ.. భారత సంతతి వారికి గోల్డెన్ ఛాన్స్
Read Latest International And Telugu News