Khawaja Asif: మాపై భారత్ దాడి చేస్తే ప్రపంచంలో ఎవ్వరూ మిగలరు
ABN , Publish Date - May 07 , 2025 | 05:36 AM
పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ భారత్‌పై చేసిన వ్యాఖ్యల్లో, పాక్ దాడి చేసినా ప్రపంచంలో ఎవ్వరూ మిగలరని, ఈ పరిస్థితిని గాజా ఘటనతో పోల్చారు
పాక్ రక్షణ మంత్రి ఖవాజా వ్యాఖ్య
ఇస్లామాబాద్, మే 6: పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారత్ కనుక పాకిస్థాన్‌పై దాడి చేసే సాహసానికి ఒడిగట్టి.. పాక్ ఉనికికి ముప్పు ఏర్పడితే.. ప్రపంచంలోనే ఎవ్వరూ మిగలరని అన్నారు. అంతేకాకుండా, ఇండియా, పాక్ మధ్య పరిస్థితిని గాజాపై ఇజ్రాయెల్ దాడితో పోల్చారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ స్నేహితుడు కూడా అదే మనస్తత్వం ప్రదర్శిస్తున్నారని ప్రధాని మోదీని ఉద్దేశించి విమర్శించారు. ఖవాజా ఓ టీవీ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.