Drone Blitz Russia: 100కు పైగా డ్రోన్లతో రష్యాపై ఉక్రెయిన్ దాడులు
ABN , Publish Date - May 07 , 2025 | 06:02 AM
విక్టరీ డే వేడుకల ముందు ఉక్రెయిన్ 100కి పైగా డ్రోన్లతో రష్యాపై పెద్ద దాడి నిర్వహించింది. రష్యా వాటిని కూల్చివేసిందని పేర్కొన్నా, మాస్కోలో నాలుగు విమానాశ్రయాలు తాత్కాలికంగా మూసివేశారు
మాస్కో/కీవ్, మే 6: రష్యా విక్టరీ డే వేడుకల ముంగిట రష్యాకు ఉక్రెయిన్ పెద్ద షాకిచ్చింది. సోమవారం రాత్రి నుంచి డజనుకు పైగా ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని వందకు పైగా డ్రోన్లను రష్యాపై ప్రయోగించింది. వాటిని తాము సమర్థంగా కూల్చేశామని, ఆస్తి, ప్రాణనష్టం జరగలేదని రష్యా ప్రకటించింది. అయితే.. మాస్కోలో ఉన్న 4విమాన్శాయ్రాలను కొన్ని గంటల పాటు తాత్కాలికంగా మూసివేయాల్సి వచ్చినట్లు తెలిపింది.