Golden Visa: న్యూజిలాండ్ ‘గోల్డెన్ వీసా’లో మార్పులు
ABN , Publish Date - Feb 10 , 2025 | 04:34 AM
దీనిలో భాగంగా ఆంగ్ల భాష ఆవశ్యకతను తొలగించనుంది. ఏప్రిల్ 1 నుంచి యాక్టివ్ ఇన్వెస్టర్ ప్లస్ వీసాను కేవలం రెండు కేటగిరీలకు కుదించనున్నామని, ఆమోదయోగ్యమైన పెట్టుబడుల పరిమితిని విస్తరిస్తామని ఆ దేశ ఇమిగ్రేషన్ శాఖ మంత్రి ఎరికా స్టాన్‌ఫోర్డ్ తెలిపారు.

వెల్లింగ్డన్, ఫిబ్రవరి 9: సంపన్న వలసదారులను ఆకర్షించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టేందుకు న్యూజిలాండ్ తన గోల్డెన్ వీసా కార్యక్రమాన్ని సరళీకృతం చేయనుంది. దీనిలో భాగంగా ఆంగ్ల భాష ఆవశ్యకతను తొలగించనుంది. ఏప్రిల్ 1 నుంచి యాక్టివ్ ఇన్వెస్టర్ ప్లస్ వీసాను కేవలం రెండు కేటగిరీలకు కుదించనున్నామని, ఆమోదయోగ్యమైన పెట్టుబడుల పరిమితిని విస్తరిస్తామని ఆ దేశ ఇమిగ్రేషన్ శాఖ మంత్రి ఎరికా స్టాన్‌ఫోర్డ్ తెలిపారు. పెట్టుబడుల కోసం న్యూజిలాండ్‌ను గమ్యస్థానంగా ఎంచుకొనేలా పెట్టుబడుదారులను ప్రోత్సహించేందుకు ఇన్వెస్టర్ వీసాను సులభతరం, మరింత సరళతరం చేస్తున్నామని ఆమె వివరించారు. కాగా, స్పెయిన్ తన గోల్డెన్ వీసా ప్రోగ్రామ్‌ను ఏప్రిల్ 3తో ముగించనుంది. యూకే, ఐర్లాండ్, నెదర్లాండ్స్, గ్రీస్, మాల్టా తమ గోల్డెన్ వీసా రూల్స్‌ను కఠినం చేశాయి. గోల్డెన్ వీసాల దుర్వినియోగం ఆరోపణలతో అనేక దేశాలు ఈ వీసాలను రద్దు చేస్తున్న సమయంలో న్యూజిలాండ్ తన ఇన్వెస్టర్ వీసా నిబంధనలను సడలిస్తుండటం గమనార్హం.
ఇవి కూడా చదవండి..
Delhi: ముంచుకొస్తున్న మరో ఎన్నిక, ఇక పార్టీల ఫోకస్ దానిపైనే..
Delhi CM: ఢిల్లీ సీఎం అతిషి రాజీనామా.. అసెంబ్లీ రద్దు
Delhi CM: ఐదేళ్లలో ముగ్గురు ముఖ్యమంత్రులు.. ఢిల్లీని బీజేపీ పాలించినపుడు ఏం జరిగిందంటే..
For More National News and Telugu News..