New Years Eve: న్యూ ఇయర్ వేడుకలకు సర్వం సిద్దం.. కళ్లు జిగేల్ మనేలా 2026 అంకెలు
ABN , Publish Date - Dec 19 , 2025 | 05:30 PM
న్యూయార్క్‌లో ప్రతి ఏడాది న్యూ ఇయర్ సెలబ్రెషన్స్ అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం నూతన సంవత్సర వేడుకలకు ముందు కళ్లు మిరుమిట్లు గొలిపేలా టైమ్స్ స్క్వేర్ లో ప్రాక్టీస్ యాక్టివేషన్ చేశారు.
న్యూయార్స్(New York ) టైమ్స్ స్క్వేర్ (Times Square)లో నూతన సంవత్సర వేడుకలు (New Year celebrations) జరుపుకునే సంప్రదాయం 1904 నుంచి మొదలైంది. అంటే దాదాపు ఇక్కడ 100 (100 years) ఏళ్ల నుంచి కొత్త ఏడాది వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద వేడుకల్లో ఇది ఒకటి. వేలాది మంది ప్రేక్షకులు ఇక్కడికి వచ్చి దీపపు కాంతుల్లో న్యూ ఇయర్ వేడుకలు ఉత్సాహంగా జరుపుకుంటారు. 2026 నూతన సంవత్సర వేడుకల కోసం నిన్న (గురువారం) భారీ ట్రక్కులో 2026 (Numerals) అనే పెద్ద అంఖ్యలు న్యూయార్క్ నగరంలోని టైమ్స్ స్క్వేర్‌కి చేరుకున్నాయి. ఇవి రాగానే పర్యాటకులు, స్థానికులు ఎంతో ఉత్సాహంగా స్వాగతం పలికారు.
ఈసారి అంకెల పొడవు 7 అడుగులు ఉన్నాయి. వీటిలో 589 ఎనర్జీ-ఎఫిషియంట్ ఎల్‌ఈడీ (LED) బల్బులు అమర్చారు. ఇవి అర్థరాత్రి వేళ వెలిగినపుడు టైమ్స్ స్క్వేర్ అంతా జిగేల్ అంటూ వెలిగిపోతుంది. ఈసారి 2026 నాలుగు అంకెలు కలిసి చాలా బరువుగా ఉన్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ‘6’ అంకెను ఈసారి కొత్తగా డిజైన్ చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ అంకెలను టైమ్స్ స్క్వేర్ లోని డఫీ స్క్వేర్ (Duffy Square) వద్ద ఉంచారు. డిసెంబర్ 23, మంగళవారం ఉదయం 7 గంటల వరకు వీధిలో ఉంచుతారు.
పర్యాటకులు, స్థానికులు ఈ అంకెలతో ఫోటోలు, వీడియోలు (Photo Opportunity) తీసుకునే అవకాశం కల్పించారు. తర్వాత వీటిని సుమార్ 400 అడుగుల ఎత్తులో ఉండే వన్ టైమ్స్ స్క్వేర్ (One Times Square) భవనం పై భాగానికి క్రేన్ల ద్వారా ఎక్కిస్తారు. డిసెంబర్ 31 అర్థరాత్రి సరిగ్గా 12 గంటలకు ప్రసిద్ద ‘క్రిస్టల్ బాల్’ కిందికి దిగగానే, 2026 అంకెలు వెలుగుతూ న్యూ ఇయర్ కి గ్రాండ్ వెల్‌కమ్ చెబుతాయి. ఈ అందమైన క్షణాన్ని కోట్ల మంది విక్షిస్తారు.
ఇవి కూడా చదవండి..
ఆ సీట్ల కోసం షిండే పట్టు.. మహాయుతిలో విభేదాలు తీవ్రం
బీజేపీ రాష్ట్ర చీఫ్ సంచలన కామెంట్.. ఆయన.. ఓ ఔట్ గోయింగ్ సీఎం..