Share News

Flash Floods in Morocco: మొరాకోలో వరద బీభత్సం.. 37 మంది మృత్యువాత..

ABN , Publish Date - Dec 16 , 2025 | 10:17 AM

మొరాకోలో భారీ వరదలు సంభవించాయి. ఈ బీభత్సానికి 37 మంది చనిపోయారని అక్కడి అధికారులు వెల్లడించారు.

Flash Floods in Morocco: మొరాకోలో వరద బీభత్సం.. 37 మంది మృత్యువాత..
Flash Floods in Morocco

ఇంటర్నెట్ డెస్క్: మొరాకో(Morocco) దేశంలో వరద బీభత్సం సృష్టిస్తోంది. తీరప్రాంత నగరమైన సాఫీ(Safi)లో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు సంభవించడంతో సుమారు 37 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో జనం గాయపడ్డారు. ఈ ప్రవాహంలో దాదాపు 70 గృహాలు, వ్యాపార సంస్థలు నీట మునిగాయి( Flash floods in Morocco).


ఆదివారం సాయంత్రం గంటపాటు ఏకధాటిగా కురిసిన భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించాయని అక్కడి అధికారులు వెల్లడించారు. ఈ వరద ధాటికి ఆ దేశ రాజధాని రబాత్‌(Rabat)కు దక్షిణంగా 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న అట్లాంటిక్(Atlantic) తీరప్రాంత నగరంలో అనేక వాహనాలు ప్రవాహంలో కొట్టుకుపోయాయి. వరద నీరు రహదారిపై పారడంతో పలుచోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. టౌటొవాన్, టింఘిర్ తదితర నగరాల్లోనూ వరదల కారణంగా భారీ నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. అగ్నిమాపక, అత్యవసర సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.


అయితే.. రాబోయే రెండు రోజుల్లో దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ అధికారులు(Weather Mnitoring Agencies) అంచనా వేశారు. ఈ నేపథ్యంలో అక్కడి అధికార యంత్రాంగం స్కూళ్లకు మూడు రోజుల పాటు సెలవు ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.


ఇవీ చదవండి:

రోడ్డుపై బస్సుల్లో మంటలు.. పలువురు సజీవ దహనం.!

చిన్నారిపై హత్యాచారం కేసు.. రాష్ట్రపతి క్షమాభిక్ష తిరస్కరణ

Updated Date - Dec 16 , 2025 | 10:25 AM