Share News

King Mswati III Grand Arrival: ఆఫ్రికా రాజు దుబాయ్ ట్రిప్.. ఆ విషయాలు తెలిసి మండిపడుతున్న నెటిజన్లు..

ABN , Publish Date - Oct 07 , 2025 | 09:02 AM

మస్వాతి తన ఫ్యామిలీతో దుబాయ్ ట్రిప్‌కు వెళ్లారు. తన వెంట 15 మంది భార్యలను.. 30 మంది పిల్లల్ని కూడా తీసుకెళ్లారు. దుబాయ్‌లో కూడా తమకు సేవలు చేయడానికి ఏకంగా 100 మంది పనివాళ్లను వెంట తీసుకెళ్లారు.

King Mswati III Grand Arrival: ఆఫ్రికా రాజు దుబాయ్ ట్రిప్.. ఆ విషయాలు తెలిసి మండిపడుతున్న నెటిజన్లు..
King Mswati III Grand Arrival

ఎస్వాతినీ.. ఇది ఆఫ్రికాలోని ఓ పేద దేశం. ఇప్పటికీ ఈ దేశం రాజుల పరిపాలనలోనే ఉంది. మూడవ మస్వాతి ఈ దేశాన్ని పరిపాలిస్తున్నాడు. మస్వాతి దేశాన్ని అభివృద్ధి పథంలోకి ఎలా తీసుకెళ్లాలని కాకుండా.. జల్సాల గురించి మాత్రమే అధికంగా ఆలోచిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మస్వాతికి సంబంధించిన ఓ పాత వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఆ వీడియోలో ఏముందంటే.. కొన్ని నెలల క్రితం మస్వాతి తన ఫ్యామిలీతో దుబాయ్ ట్రిప్‌కు వెళ్లారు. తన వెంట 15 మంది భార్యలను.. 30 మంది పిల్లల్ని కూడా తీసుకెళ్లారు. దుబాయ్‌లో కూడా తమకు సేవలు చేయడానికి ఏకంగా 100 మంది పనివాళ్లను వెంట తీసుకెళ్లారు. రాజ కుటుంబం కావటంతో దుబాయ్ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇక, మస్వాతి పరివారం కోసం ఎయిర్ పోర్టులోని పలు టెర్మినళ్లను మూసి వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.


ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు మస్వాతిపై మండిపడుతున్నారు. ‘నీ జల్సాల కోసం ప్రజల సొమ్మును ఖర్చు చేస్తున్నావు. అది మంచి పద్దతి కాదు’.. ‘మస్వాతి తండ్రి రెండవ సోభుజాకు 125 మంది భార్యలు ఉండేవారు. రాజులంటేనే విలాస పురుషులు. వారిని ఏమీ అనలేము’..‘ఒక్క భార్యతోటే అల్లాడిపోతున్నాం. నువ్వు 15 మందిని ఎలా చేసుకున్నావయ్యా?’అంటూ కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

ఎస్ఐ దారుణ ప్రవర్తన.. బైక్ ఆపనందుకు యువకుడ్ని..

ఆన్‌‘లైన్‌’ తప్పుతున్నారు.. సోషల్‌ మీడియా స్నేహాలతో అడ్డదారులు

Updated Date - Oct 07 , 2025 | 12:12 PM