Sub Inspector Slaps Student: ఎస్ఐ దారుణ ప్రవర్తన.. బైక్ ఆపనందుకు యువకుడ్ని..
ABN , Publish Date - Oct 07 , 2025 | 08:33 AM
గోశాల క్రాసింగ్ పోలీస్ పోస్ట్ దగ్గర ఎస్ఐ త్రిపాఠి బైక్ ఆపమంటూ అక్షయ్‌కి సిగ్నల్ ఇచ్చాడు. అక్షయ్ బైకు ఆపడానికి బదులు.. అక్కడి నుంచి వేగంగా దూసుకువెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే, పోలీసులు అతడ్ని ఛేస్ చేసి పట్టుకున్నారు.
తనకు ఎదురు చెప్పాడన్న కోపంతో ఓ ఎస్ఐ యువకుడిపై రెచ్చిపోయాడు. బూతులు తిడుతూ యువకుడ్ని దారుణంగా కొట్టాడు. రోడ్డుపై పోలీస్ చెకింగ్స్ సందర్భంగా ఆ యువకుడు బైక్ ఆపకపోవటం వల్ల ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. కాన్పూర్, నరమౌవ్ గ్రామానికి చెందిన అక్షయ్ తన మిత్రుడితో కలిసి బైకుపై కిద్వాయ్ నగర్ వెళుతున్నాడు.
గోశాల క్రాసింగ్ పోలీస్ పోస్ట్ దగ్గర ఎస్ఐ త్రిపాఠి బైక్ ఆపమంటూ అక్షయ్‌కి సిగ్నల్ ఇచ్చాడు. అక్షయ్ బైకు ఆపడానికి బదులు.. అక్కడి నుంచి వేగంగా దూసుకువెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే, పోలీసులు అతడ్ని ఛేస్ చేసి పట్టుకున్నారు. సీఐ త్రిపాఠి తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయాడు. అక్షయ్ కాలర్ పట్టుకుని పోలీస్ స్టేషన్‌లోకి ఈడ్చుకెళ్లాడు. అక్షయ్ ఎస్ఐకి ఎదురుతిరిగాడు.
చట్ట ప్రకారం ఇలా ప్రవర్తించటం నేరం అని త్రిపాఠితో అన్నాడు. అక్షయ్ ఎదురు తిరగటంతో సీఐ కోపం కట్టలు తెంచుకుంది. బూతులు తిడుతూ అతడిపై దాడికి దిగాడు. దీన్నంతా అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీశాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వీడియో వైరల్‌గా మారి పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. అధికారులు ఈ సంఘటనపై స్పందించారు. సీఐ త్రిపాఠిపై చర్యలకు సిద్ధమయ్యారు.
ఇవి కూడా చదవండి
కస్టమర్‌కు ఊహించని షాక్.. రాగి సంగటిలో బొద్దింక..
అదరగొట్టిన టీపాడ్ బతుకమ్మ, దసరా మెగా ఈవెంట్