Cockroach Found In Ragi Sangati: కస్టమర్‌కు ఊహించని షాక్.. రాగి సంగటిలో బొద్దింక..
ABN , Publish Date - Oct 07 , 2025 | 07:38 AM
హైదరాబాద్‌లోని ఓ రెస్టారెంట్‌లో రాగి సంగటి తింటున్న కస్టమర్‌కు అసహ్యం కలిగించే అనుభవం ఎదురైంది. ఆహారంలో బొద్దింకను గుర్తించిన వ్యక్తి వెంటనే వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ ఘటనపై అధికారులకు ఫిర్యాదు కూడా చేశాడు. దీనిపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దృష్టికి వెళ్లింది.
బయట హోటళ్లలో తిండి తినాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని హోటళ్లు శుభ్రత అస్సలు పాటించటం లేదు. తినే తిండిలో పురుగులు, బొద్దింకలు, జెర్రులు.. ఏకంగా పాములు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా, హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో భోజనం చేస్తున్న కస్టమర్‌కు ఊహించని షాక్ తగిలింది. తినేతిండిలో బొద్దింక వచ్చింది. దీంతో ఆ కస్టమర్ హోటల్ వారితో గొడవకు దిగాడు.
ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఓ వ్యక్తి నానక్‌రామ్ గూడలోని ప్రముఖ హోటల్‌కు వెళ్లాడు. రాగి సంగటి ఆర్డర్ చేసుకుని తింటూ ఉన్నాడు. సగం తిన్న తర్వాత అందులో బొద్దింక కనిపించింది. దీంతో అతడు షాక్ అయ్యాడు. హోటల్ మేనేజ్‌మెంట్‌ను బొద్దింక గురించి ప్రశ్నించాడు. వారు ఇచ్చిన సమాధానంతో అతడికి కోపం వచ్చింది.
రాగి సంగటిలో బొద్దింక దృశ్యాలను వీడియో తీశాడు. తర్వాత ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. శుభ్రత పాటించకుండా కస్టమర్ల ఆరోగ్యాలతో ఆడుకుంటున్న హోటల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు హోటల్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
అదరగొట్టిన టీపాడ్ బతుకమ్మ, దసరా మెగా ఈవెంట్
పసిడి పరుగులు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..