Share News

Canada cabinet reshuffle: కెనడా విదేశాంగ మంత్రిగా అనితా ఆనంద్‌

ABN , Publish Date - May 15 , 2025 | 04:35 AM

కెనడాలో ఇటీవల జరిగిన ఫెడరల్‌ ఎన్నికల్లో లిబరల్‌ పార్టీ విజయం సాధించి, భారత మూలాలున్న నలుగురు ఎంపీలు మంత్రివర్గంలో కీలక పదవులు పొందారు. అనితా ఆనంద్ విదేశాంగ మంత్రిగా, మణిందర్ సిద్ధు వాణిజ్య మంత్రిగా నియమితులయ్యారు.

Canada cabinet reshuffle: కెనడా విదేశాంగ మంత్రిగా అనితా ఆనంద్‌

మంత్రివర్గంలో మరో ముగ్గురు భారత సంతతి ఎంపీలు

ఒట్టావా, మే 14: కెనడా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భారత సంతతి ఎంపీలకు కీలక పదవులు లభించాయి. ఇటీవల కెనడాలో జరిగిన ఫెడరల్‌ ఎన్నికల్లో లిబరల్‌ పార్టీ మరోసారి ఘనవిజయం సాధించి అధికారాన్ని దక్కించుకుంది. ఈ క్రమంలోనే కెనడా ప్రధాని మార్క్‌ కార్నీ మంత్రివర్గంలో భారత మూలాలున్న నలుగురు కెనెడియన్లు చోటు దక్కించుకున్నారు. అనితా ఆనంద్‌ను విదేశాంగ మంత్రిగా, మణిందర్‌ సిద్ధును వాణిజ్యమంత్రిగా కీలక శాఖలు కేటాయించారు. రూబీ సహోటా నేర నిరోధక విభాగ సహాయ మంత్రిగా, రణ్‌దీప్‌ సారాయ్‌ అంతర్జాతీయ విదేశాంగ కార్యదర్శిగా నియమితులయ్యారు. 58 ఏళ్ల అనితా ఆనంద్‌ కెనడాలోని ఓక్‌విల్లే నుంచి ఎంపీగా 2019లో ఎంపికయ్యారు. గతంలో కెనడా రక్షణ మంత్రిగా సహా పలు కీలక పదవుల్లోపనిచేసిన అనుభవం ఉంది. ఒకానొక సమయంలో ప్రధాని పదవికి పోటీదారుగా నిలిచారు. 41 ఏళ్ల మణిందర్‌ సిద్ధు బ్రాంప్టన్‌ ఈస్ట్‌ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. వాణిజ్యమంత్రిగా సిద్ధు నియామకం ట్రంప్‌ ప్రభుత్వం కెనడాపై విధించిన టారి్‌ఫలను వ్యతిరేకిస్తున్న సమయంలో జరగడం గమనార్హం. ప్రధాని తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని ప్రమాణస్వీకారం అనంతరం ఎక్స్‌ వేదికగా మంత్రులు ప్రకటించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Operation Sindoor: మసూద్ అజార్‌కు రూ. 14 కోట్లు చెల్లించనున్న పాక్

Donald Trump: అమెరికాకు సౌదీ బహుమతి.. స్పందించిన ట్రంప్

Teachers in Class Room: క్లాస్ రూమ్‌లోనే దుకాణం పెట్టిన హెడ్ మాస్టర్లు.. వీడియో వైరల్

For AndhraPradesh News And Telugu News

Updated Date - May 15 , 2025 | 04:35 AM