Fire Accident at Indonesia: ఇండోనేషియాలో భారీ అగ్నిప్రమాదం.. 16 మంది దుర్మరణం
ABN , Publish Date - Dec 29 , 2025 | 02:16 PM
ఇండోనేషియాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ వృద్ధాశ్రమంలో మంటలు చెలరేగిన ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇండోనేషియాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది(Indonesia fire Accident). మనాడో నగరంలోని ఓ వృద్ధాశ్రమంలో జరిగిన ఈ ప్రమాదంలో 16 మంది సజీవ దహనమయ్యారు(16 people has died). మరో 15 మందిని సురక్షితంగా కాపాడినట్టు అక్కడి అధికారులు వెల్లడించారు. వారిలో కొందరు స్వల్పంగా గాయపడగా.. వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రులకు తరలించామని చెప్పారు. వెర్ధా దమై వృద్ధాశ్రమంలో ఈ ఘటన జరిగిందని స్థానిక మీడియా నివేదిక పేర్కొంది.
ఘటనా సమయంలో ఆశ్రమంలోని వృద్ధులంతా.. గాఢ నిద్రలో ఉన్నారని అందువల్లే భారీగా ప్రాణనష్టం వాటిల్లిందని మనాడో అగ్నిమాపక విభాగాధిపతి జిమ్మీ రొటిన్సులు(Manado fire Dept Chief Jimmy Rotinsulu) తెలిపారు. మంటలు వేగంగా వ్యాపించడంతో.. లోపలివారు బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయిందని చెప్పారు. మొత్తం 16 మంది మృతుల్లో 10 మంది మహిళలూ ఉన్నారని ఆయన పేర్కొన్నారు. వీరందరి వయస్సులు 65 నుంచి 85 ఏళ్ల మధ్య ఉంటుందని ఆయన అన్నారు.
ప్రమాద సమయంలో ఉవ్వెత్తున ఎగిసిపడే మంటలను ఆర్పి వేసేందుకు సుమారు రెండు గంటల సమయం పట్టిందని అక్కడి అధికారులు తెలిపారు. ఆ భవనంలోని వంటగదిలో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. అయితే.. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టారు అధికారులు. ఆ ఆశ్రమంలో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలను పాటించారా లేదా అనే కోణంలోనూ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
ఇవీ చదవండి:
ఎంత దారుణం! ఐదుగురు పిల్లల తల్లి.. కన్నబిడ్డలపై కనికరం లేకుండా..
ఇది ఏఐ నామ సంవత్సరం.. ఆశ్చర్యం కలిగించే మార్పులు