Share News

Driver attack on Minor in NZ: ఆ దేశంలో మైనర్‌పై ఇండియన్ ఉబర్ డ్రైవర్ అత్యాచారం.. జైలు శిక్ష

ABN , Publish Date - Dec 07 , 2025 | 08:40 PM

న్యూజిలాండ్‌లో ఓ మైనర్‌పై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో ఓ ఎన్ఆర్ఐకి జైలు శిక్ష పడింది. రెండేళ్ల క్రితం జరిగిన ఈ ఘటనపై తాజాగా తీర్పు వెల్లడించింది అక్కడి న్యాయస్థానం.

Driver attack on Minor in NZ: ఆ దేశంలో మైనర్‌పై ఇండియన్ ఉబర్ డ్రైవర్ అత్యాచారం.. జైలు శిక్ష
Indian-Origin Uber Driver Satwinder Singh Jailed In New Zealand

ఇంటర్నెట్‌ డెస్క్‌: న్యూజిలాండ్‌(New Zealand)లో భారత సంతతికి చెందిన ఓ ఉబర్ డ్రైవర్.. రెండేళ్ల క్రితం అక్కడి ఓ మైనర్‌పై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి ఇటీవల విచారణ చేపట్టిన న్యాయస్థానం నిందితునికి జైలుశిక్ష విధించింది.


ఇదీ జరిగింది..

భారత సంతతి(Indian Origin) వ్యక్తి అయిన సత్వీందర్ సింగ్(Satwinder Singh).. సుమారు 11 ఏళ్లుగా న్యూజిలాండ్‌లో నివాసం ఉంటున్నాడు. ఉబర్ డ్రైవర్‌(Uber Driver)గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. 2023లో ఓ మైనర్‌ ప్రయాణికురాలు రాత్రివేళ క్యాబ్‌ బుక్‌ చేసుకోగా.. సత్వీందర్ సింగ్ పికప్ చేసుకోవడానికి కారుతో ఆమె వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో అతడు జీపీఎస్‌(GPF) ఆఫ్‌ చేసి.. వెళ్లాల్సిన మార్గం కాకుండా కారు రూటు మార్చాడు. ఆమెను వేరే చోటుకు తీసుకెళ్లి.. గమ్యస్థానం వచ్చిందని నమ్మించసాగాడు. అలా ఆమెతో పలకరిస్తూ.. అసభ్యకరంగా మాట్లాడి ఆమెపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత అతడే బాధితురాలిని ఆమె స్నేహితుల ఇంటి వద్ద వదిలేసినట్టు సమాచారం.


ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా సత్వీందర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుపై తాజాగా అక్కడి న్యాయస్థానం విచారణ చేపట్టింది. నిందితుడిగా తేలిన సత్వీందర్‌కు ఏడేళ్లకుపైగా జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.


ఇవీ చదవండి:

మోదీజీ నాకు న్యాయం చేయండి ప్లీజ్.. పాక్ మహిళ ఆవేదన..

ఈ చిట్కాలతో పీసీఓఎస్, డయాబెటిస్‌ను అదుపు చేయండిలా...

Updated Date - Dec 07 , 2025 | 09:26 PM