Share News

Indian engineer shot: అమెరికా పోలీసుల కాల్పుల్లో తెలంగాణ యువకుడి మృతి.. చనిపోయే ముందు..

ABN , Publish Date - Sep 20 , 2025 | 01:59 PM

తెలంగాణకు చెందిన 29 ఏళ్ల మహ్మద్ నిజాముద్దీన్ అనే వ్యక్తి అమెరికాలోని క్యాలిఫోర్నియాలో జరిగిన పోలీసులు కాల్పుల్లో మృతి చెందాడు. సెప్టెంబర్ 3వ తేదీన తన రూమ్‌మేట్‌తో జరిగిన గొడవ తర్వాత శాంటాక్లారా పోలీసులు అతడిని కాల్చి చంపారు.

Indian engineer shot: అమెరికా పోలీసుల కాల్పుల్లో తెలంగాణ యువకుడి మృతి.. చనిపోయే ముందు..
Mohammed Nizamuddin

తెలంగాణకు చెందిన 29 ఏళ్ల మహ్మద్ నిజాముద్దీన్ (Mohammed Nizamuddin) అనే వ్యక్తి అమెరికాలోని క్యాలిఫోర్నియాలో జరిగిన పోలీసులు కాల్పుల్లో మృతి చెందాడు. సెప్టెంబర్ 3వ తేదీన తన రూమ్‌మేట్‌తో జరిగిన గొడవ తర్వాత శాంటాక్లారా పోలీసులు అతడిని కాల్చి చంపారు (Santa Clara police shooting). ఆ కాల్పుల ఘటనకు ముందు నిజాముద్దీన్ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాను జాతి విద్వేషం, వివక్షకు గురైనట్టు నిజాముద్దీన్ ఆరోపించాడు.


'ఈ రోజు వివక్షకు వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడాలని నిర్ణయించుకున్నాను. ఇక చాలు.. తెల్లవారి ఆధిపత్యం, జాత్యాంహకార తెల్ల అమెరికన్ మనస్తత్వం అంతరించాలి' అని నిజాముద్దీన్ లింక్డిన్‌లో పోస్ట్ చేశాడు. ఆఫీస్‌లో మోసం, వేధింపులు, వేతన విషయంలో మోసం, అక్రమంగా ఉద్యోగం నుంచి తొలగించడం మొదలైన విషయాలను ప్రస్తావించాడు. ఏడాదిన్నర కాలంగా నిరుద్యోగిగా ఉన్న నిజాముద్దీన్ కొత్త ఉద్యోగం కోసం అన్వేషణ సాగిస్తున్నాడు (workplace discrimination).


గతంలో పని చేసిన కంపెనీలో జాతి విద్వేషాన్ని, అహంకారపూరిత వాతావరణాన్ని ఎదుర్కొన్నానని ఆరోపించాడు. కాగా, నిజాముద్దీన్ ఉన్నత విద్య కోసం 2016లో అమెరికా వెళ్లాడు. సెప్టెంబర్ 3వ తేదీ ఉదయం రూమ్మేట్‌తో నిజాముద్దీన్‌కు ఏసీ విషయంలో గొడవ జరిగినట్టు తెలుస్తోంది. ఆ గొడవ కత్తిపోట్ల వరకు వెళ్లింది. ఇరుగుపొరుగు వారు పోలీసులకు ఫోన్ చేశారు (US police shooting). పోలీసులు ఆ ఇంట్లోకి ప్రవేశించే సమయానికి నిజాముద్దీన్ కత్తి పట్టుకుని రూమ్మేట్‌పై దాడి చేస్తున్నాడు. దాంతో పోలీసులు అతడిపై కాల్పులు జరిపారు. నాలుగు బుల్లెట్ గాయాలు కావడంతో నిజాముద్దీన్ అక్కడికక్కడే మరణించాడు.


ఇవి కూడా చదవండి:

హెచ్‌1బీ ఉద్యోగులకు ట్రంప్ గోల్డ్, ప్లాటినం, కార్పొరేట్ గోల్డ్ కార్డులు.. ఏమిటివి?

లక్ష డాలర్లు కడితేనే అడుగుపెట్టండి.. ట్రంప్ వింత కండీషన్..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 20 , 2025 | 05:18 PM