Share News

India pollutionకాలుష్య దేశాల్లో.. భారత్‌ టాప్‌-3

ABN , Publish Date - Feb 26 , 2025 | 04:13 AM

ప్రపంచంలోనే అత్యంత కాలుష్య దేశాల్లో భారత్‌ మూడోస్థానంలో ఉన్నట్లు రియల్‌-టైమ్‌ గాలి నాణ్యత వివరాలను అందజేసే ఓపెన్‌సోర్స్‌ సంస్థ ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌(ఏక్యూఐ) వెల్లడించింది. 2024 సంవత్సరంలో సగటు ఏక్యూఐ 140తో బంగ్లాదేశ్‌, 115 ఏక్యూఐతో పాకిస్థాన్‌ మొదటి రెండు స్థానాల్లో ఉండగా.. 111 గాలి నాణ్యతతో భారత్‌ మూడోస్థానంలో నిలిచింది. టాప్‌-10లో మిగతా స్థానాల్లో బహ్రెయిన్‌(103), నేపాల్‌(100), ఈజిప్ట్‌(92), యూఏఈ(90), కువైత్‌(89), తజకిస్థాన్‌(89), కిర్గిస్థాన్‌(87) ఉన్నాయి.

India pollutionకాలుష్య దేశాల్లో.. భారత్‌ టాప్‌-3

బంగ్లాదేశ్‌, పాక్‌కు తొలి రెండుస్థానాలు

ఏక్యూఐ-2024 నివేదికలో వెల్లడి

(సెంట్రల్‌ డెస్క్‌)

ప్రపంచంలోనే అత్యంత కాలుష్య దేశాల్లో భారత్‌ మూడోస్థానంలో ఉన్నట్లు రియల్‌-టైమ్‌ గాలి నాణ్యత వివరాలను అందజేసే ఓపెన్‌సోర్స్‌ సంస్థ ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌(ఏక్యూఐ) వెల్లడించింది. 2024 సంవత్సరంలో సగటు ఏక్యూఐ 140తో బంగ్లాదేశ్‌, 115 ఏక్యూఐతో పాకిస్థాన్‌ మొదటి రెండు స్థానాల్లో ఉండగా.. 111 గాలి నాణ్యతతో భారత్‌ మూడోస్థానంలో నిలిచింది. టాప్‌-10లో మిగతా స్థానాల్లో బహ్రెయిన్‌(103), నేపాల్‌(100), ఈజిప్ట్‌(92), యూఏఈ(90), కువైత్‌(89), తజకిస్థాన్‌(89), కిర్గిస్థాన్‌(87) ఉన్నాయి. ఏక్యూఐ 50లోపు ఉంటే.. కాలుష్యపరంగా సురక్షిత దేశాలుగా పరిగణిస్తారు. ఒక్క ఈజిప్ట్‌ మినహా.. టాప్‌-10లో ఆసియా దేశాలే ఉండడం గమనార్హం..! ఏక్యూఐ విడుదల చేసిన టాప్‌-50 కాలుష్య నగరాల్లో సింహభాగం ఉత్తరభారత దేశంలోనే ఉన్నాయి.


ఇంకా చెప్పాలంటే.. టాప్‌-12 స్థానాలన్నింటినీ భారతే ఆక్రమించింది. ఏక్యూఐ 169తో దేశ రాజధాని న్యూఢిల్లీ ముందంజలో ఉండగా.. తర్వాతి స్థానంలో గ్రేటర్‌ నోయిడా(166) ఉంది. బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకా(140) 13 స్థానంలో నిలిచింది. ఏక్యూఐ డేటా పరంగా భారత్‌లోని దక్షిణాది నగరాలు కొంత వరకు సురక్షితమైనవే అయినా.. రియల్‌-టైమ్‌ డేటాలో మాత్రం దక్కన్‌ పీటభూమి దిగువ ప్రాంతాలు టాప్‌లో ఉంటున్నాయి. మంగళవారం సాయంత్రం 6 గంటలకు తమిళనాడులోని తూటికోరిన్‌(225), దిండిగల్‌(201), కరూర్‌(195) టాప్‌-3లో ఉండగా.. ఏపీలోని జమ్మలమడుగు(189), చిత్తూరు(188) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.


మరిన్నీ తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: డీఎస్సీ‌‌పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

Also Read : మాజీ ఎంపీకి జీవిత ఖైదు

Also Read: రైతుల కోసం ఈ పథకాలు.. వీటి వల్ల ఎన్నో లాభాలు.. ఇదే అర్హత.. ఇలా అప్లై చేసుకోండి చాలు

Also Read : అసోం బిజినెస్ సమ్మిట్‌లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

Also Read: రిమాండ్ మళ్లీ పొడిగింపు.. విచారణలో నోరు విప్పని వంశీ

For National News And Telugu News

Updated Date - Feb 26 , 2025 | 04:13 AM