Share News

India Nepal Border Dispute: కాలాపానీ ప్రాంతం మీదుగా చైనాతో వాణిజ్యంపై నేపాల్ అభ్యంతరాలు.. ఖండించిన భారత్

ABN , Publish Date - Aug 21 , 2025 | 08:17 AM

కాలాపానీ ప్రాంతం తమదని, ఈ ప్రాంతం మీదుగా భారత్-చైనా వాణిజ్యంపై నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేయడంపై భారత్ స్పందించింది. ఇది నిరాధారం వాస్తవ దూరమని స్పష్టం చేసింది. చెల్లుబాటు కాదని తేల్చి చెప్పింది.

India Nepal Border Dispute: కాలాపానీ ప్రాంతం మీదుగా చైనాతో వాణిజ్యంపై నేపాల్ అభ్యంతరాలు.. ఖండించిన భారత్
India Nepal Lipulekh Dispute

ఇంటర్నెట్ డెస్క్: భారత్ సరిహద్దు వద్ద లిపులేఖ్ ప్రాంతం మీదుగా చైనాతో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించడంపై నేపాల్ చెప్పిన అభ్యంతరాలను కేంద్ర ప్రభుత్వం తోసి పుచ్చింది. నేపాలు అభ్యంతరాలు సబబు కాదని, ఏ రకంగాను సమర్థించలేమని స్పష్టం చేసింది. చారిత్రక వాస్తవాలకు అనుగుణంగా లేవని పేర్కొంది. లిపులేఖ్‌కు దక్షిణాన ఉన్న భారత భూభాగమైన కాలాపానీ ప్రాంతాన్ని నేపాల్ తనదిగా చెప్పుకుంటున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఇటీవల ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. భారత్, చైనా మధ్య ఈ ప్రాంతం మీదుగా వాణిజ్య కార్యకలాపాలు చేపట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో ఈ కామెంట్స్ చేసింది. ఆ ప్రాంతంలో వాణిజ్యం సహా ఎలాంటి కార్యకలాపాలు చేపట్టొద్దని డిమాండ్ చేసింది.

ఈ ప్రకటనపై భారత ప్రభుత్వం మండిపడింది. నేపాల్ వ్యాఖ్యలు చారిత్రక వాస్తవాలు, ఆధారాలకు అనుగూణంగా లేదని స్పష్టం చేసింది. తప్పుడు పద్ధతుల్లో సరిహద్దు విస్తరణ సమర్థనీయం కాదని స్పష్టం చేసింది. ఈ సరిహద్దు విషయంలో భారత్ మొదటి నుంచి పూర్తి స్పష్టతతో ఉందని పేర్కొంది. చైనా, భారత్ మధ్య లిపులేఖ్ మీదుగా సరిహద్దు వాణిజ్యం 1954లో మొదలైందని, అప్పటి నుంచీ ఇటీవల ఆటంకాలు ఎదురయ్యే వరకూ దశాబ్దాలగ పాటు నిరాఘాటంగా కొనసాగిందని గుర్తు చేసింది. అయితే, ఈ సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకునేందుకు నేపాల్‌తో నిర్మాణాత్మక చర్చలు జరిపేందుకు కూడా తాము సిద్ధమేనని కేంద్రం పేర్కొంది.


సరిహద్దు వెంబడి వాణిజ్యం పునరుద్ధరణకు భారత్, చైనా ఇటీవల అంగీకరించిన విషయం తెలిసిందే. చైనా విదేశాంగ శాఖ మంత్రి భారత పర్యటన సందర్భంగా ఇరు దేశాలు ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఈ నేపథ్యంలో నేపాల్‌ ప్రభుత్వం స్పందిస్తూ తమ అధికారిక మ్యాపును రాజ్యాంగంలో కూడా చేర్చామని గుర్తు చేశారు. మహాకాళీ నదికి తూర్పున ఉన్న లింపియదుర, లిపూలేఖ్, తూర్పు కాలాపాని మాత్రం మా పరిధిలోనే ఉన్నాయని పేర్కొంది. అయితే, భారత్, నేపాల్ మధ్య స్నేహ బంధం దృష్ట్యా సరిహద్దు సమస్యలను దౌత్య మార్గాల్లో పరిష్కరించుకునేందుకు కట్టుబడి ఉన్నామని కూడా స్పష్టం చేసింది.

ఏమిటీ సరిహద్దు వివాదం

1816లో కుదిరిని సుగౌలీ ఒప్పందం ప్రకారం కాళీ నదిని భారత్, నేపాల్ పశ్చిమ భూభాగం మధ్య సరిహద్దుగా నిర్ణయించారు. అయితే, కాళీ నది జన్మస్థలం లింపియదుర అని నేపాల్ వాదిస్తోంది. ఫలితంగా లింపియదురకు తూర్పున ఉన్న కాలాపానీ ప్రాంతం, లిపులేఖ్ తమ భూభాగాలని వాదిస్తోంది. కానీ భారత్ మాత్రం ఈ వాదనను కొట్టిపారేస్తోంది. నది జన్మస్థలం కాలాపానీకి సమీపంలోనే ఉందని, కాబట్టి ఈ ప్రాంతమంతా ఉత్తరాఖండ్ రాష్ట్ర పరిధిలోకి వస్తుందని వాదిస్తోంది.


ఇవి కూడా చదవండి:

పుతిన్, జెలెన్‌స్కీ భేటీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి: డొనాల్డ్ ట్రంప్

అమెరికాతో వాణిజ్య చర్చలు వాయిదా.. భారత్‌పై 50 శాతం సుంకం తప్పదా..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 21 , 2025 | 08:54 AM