Pak: ఇండియా ఏడాదిలోపే మళ్లీ దాడి చేయవచ్చు.. పాక్ విపక్ష నేత హెచ్చరిక
ABN , Publish Date - Jun 25 , 2025 | 07:00 PM
భారతదేశం అధునాతన ఆయుధాలు, మందుగుండు సామగ్రిపై దూకుడుగా పెట్టుబడులు పెడుతూ దేశ రక్షణ సామర్థ్యాన్ని అసాధారణ స్థాయికి తీసుకువెళ్తోందని పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ నేత ఒమర్ అయూబ్ అన్నారు.
ఇస్లామాబాద్: భారతదేశం మరోసారి పాకిస్థాన్‌పై దాడి చేయవచ్చని నేషనల్ అసెంబ్లీలో పాక్ విపక్ష నేత ఒమర్ అయూబ్ ఖాన్ (Omar Ayub Khan) ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ ఇటీవల ఆయుధాలను అభివృద్ధి చేసుకుంటూ వెళ్తుండటాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇండియా మిలటరీ సామర్థ్యంతో పోల్చుకుంటే పాక్ చాలా వెనకబడిందని ప్రధాని షెహబాజ్ షరీఫ్ నాయకత్వంపై విమర్శలు గుప్పించారు. రక్షణ సామర్థ్యాన్ని భారతదేశం విస్తరించుకుంటూ పోతోందని, ఇందువల్ల పాకిస్థాన్ జాతీయ భద్రతకు తీవ్ర ముప్పు ఏర్పడవచ్చని హెచ్చరించారు.
అడ్వాన్స్‌డ్ ఆయుధాలతో భారత్
భారతదేశం అధునాతన ఆయుధాలు, మందుగుండు సామగ్రిపై దూకుడుగా పెట్టుబడులు పెడుతూ దేశ రక్షణ సామర్థ్యాన్ని అసాధారణ స్థాయికి తీసుకువెళ్తోందని పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ నేత ఒమర్ అయూబ్ అన్నారు. ఇదే వేగంతో వ్యవహరించడంలో పాకిస్థాన్ విఫలమవుతోందని, ఇందువల్ల వ్యూహాత్మక అసమతుల్యత కనిపిస్తోందని అన్నారు. భారతదేశ మోడ్రనైజేషన్ డ్రైవ్‌తో పోల్చినప్పుడు పాక్ ఎక్కడా కనిపించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
భారత్‌లో పెరుగుతున్న డిఫెన్స్ బడ్జెట్
ఇండియా తమ రక్షణ బడ్జెట్‌ను పెంచుకుంటూ పోతోందని, మిలటరీ ప్రొక్యూర్‌మెంట్ వేగంగా సాగుతుండటం ఇస్లామాబాద్‌లోని పాలసీమేకర్లకు ఆందోళన కలిగిస్తోందని అయూబ్ అన్నారు. ముఖ్యంగా ద్వైపాక్షిక సంబంధాలు ఇబ్బందుల్లో పడటం, సరిహద్దు ప్రాంతీయ అస్థిరత నేపథ్యంలో ఈ ఆందోళనలను మరింత పెంచుతున్నాయని పేర్కొన్నారు. షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం దేశ భద్రతా అవసరాలను పట్టించుకునే బదులు బుజ్జగింపు దౌత్యానికి పాల్పడుతోందని విమర్శించారు.
రహస్యంగా న్యూక్లియర్ బాలిస్టిక్ మిసైళ్లను అభివృద్ధి చేస్తున్న పాక్
కమాండర్ అభినందన్‌ను బంధించిన పాకిస్థాన్ మేజర్ హతం
మరిన్ని ఏపీ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి