Share News

Donald Trump: తారాస్థాయికి గొడవలు.. మస్క్‌ను పుల్లలా తీసిపడేసిన ట్రంప్

ABN , Publish Date - Jun 07 , 2025 | 12:10 PM

Musk vs Trump: డొనాల్డ్ ట్రంప్.. ఎలన్ మస్క్‌లు మీడియాలో, సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇద్దరి మధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి తయారు అయింది.

Donald Trump: తారాస్థాయికి గొడవలు.. మస్క్‌ను పుల్లలా తీసిపడేసిన ట్రంప్
Musk vs Trump

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ ఒకప్పుడు ‘దోస్త్ మేరా దోస్త్.. తూహై మేరీ జాన్’ అన్నట్లు ఉండేవారు. ఇప్పుడు పరిస్థితులు దారుణంగా తయారు అయ్యారు. ఇద్దరూ బద్ధ శత్రువుల్లా మారారు. మీడియాలో, సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇద్దరి మధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి తయారు అయింది. ఈ నేపథ్యంలోనే తాాజగా జరిగిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ట్రంప్.. మస్క్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


ఆయన మాట్లాడుతూ.. ‘నిజం చెప్పాలంటే.. నేను చైనా, రష్యా, ఇరాన్‌లకు సంబంధించిన విషయాలపై పని చేస్తూ బిజీగా ఉన్నా. నేను చాలా విషయాలపై పని చేస్తున్నాను. మస్క్ గురించి ఆలోచించటం లేదు. అతడికి ఆల్ ది బెస్ట్. ఎవరు లేకపోయినా అమెరికా బాగానే ఉంటుంది. కానీ, నేను లేకుండా అయితే కాదు’ అని అన్నారు. ఈ సందర్భంగా మస్క్‌కు వార్నింగ్ కూడా ఇచ్చారు. మస్క్ కంపెనీలతో ప్రభుత్వం చేసుకున్న ఫెడరల్ కాంట్రాక్ట్స్ రద్దు చేసే అవకాశం ఉందన్నారు.


మస్క్ కొత్త పార్టీ

ఎలన్ మస్క్ కొత్త పార్టీ పెట్టబోతున్నారు. ఆ పార్టీకి ‘ది అమెరికా పార్టీ’ అని పేరు కూడా పెట్టారు. పార్టీ పెట్టడానికి కంటే ముందు ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. ఎక్స్‌లో పోల్ పెట్టి నెటిజన్ల అభిప్రాయం తీసుకున్నారు. మొత్తం 50 లక్షల మంది ఓట్లు వేశారు. అందులో 80 శాతం మంది కొత్త పార్టీ కావాలన్నారు. 20 శాతం మంది అవసరం లేదన్నారు. 80 శాతం మంది అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని.. మస్క్ తన కొత్త పార్టీ పేరును ప్రకటించారు.


ఇవి కూడా చదవండి

కొత్త పార్టీ పెడుతున్న మస్క్.. పేరు ఏంటంటే..

500 నోట్లు కూడా రద్దేనా..? ఆర్బీఐ ఏం చెబుతోందంటే..

Updated Date - Jun 07 , 2025 | 12:17 PM