Share News

Elon Musk: కొత్త పార్టీ పెడుతున్న మస్క్.. పేరు ఏంటంటే..

ABN , Publish Date - Jun 07 , 2025 | 11:23 AM

Elon Musk New Political Party: ఎలన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొత్త పార్టీ పెట్టడానికి చూస్తున్నారు. ఈ మేరకు పార్టీ పేరు కూడా అనౌన్స్ చేశారు. తన కొత్త పార్టీకి ‘ది అమెరికా పార్టీ’ అని పేరు పెట్టారు.

Elon Musk: కొత్త పార్టీ పెడుతున్న మస్క్.. పేరు ఏంటంటే..
Elon Musk New Political Party

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌.. ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్‌కు మధ్య గత కొద్దిరోజుల నుంచి గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా, ఈ వివాదం తారాస్థాయికి చేరింది. మస్క్‌ను దెబ్బకొట్టడానికి ట్రంప్ ప్రయత్నాలు మొదలెట్టారు. ఈ నేపథ్యంలోనే ఎలన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొత్త పార్టీ పెట్టడానికి చూస్తున్నారు. ఈ మేరకు పార్టీ పేరు కూడా అనౌన్స్ చేశారు. తన కొత్త పార్టీకి ‘ది అమెరికా పార్టీ’ అని పేరు పెట్టారు. పార్టీ పెట్టడానికంటే ముందు మస్క్ ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. ఎక్స్ ఖాతాలో ఓ పోల్ పెట్టారు.


‘మధ్యలో ఉన్న 80 శాతం మంది కోసం అమెరికాలో ఓ కొత్త పార్టీ పెట్టడానికి ఇది సరైన సమయమేనా?’ అని ప్రశ్నించారు. జూన్ 5వ తేదీ రాత్రి 11.27 గంటలకు పోల్ పెట్టగా కొన్ని లక్షల మంది దానిపై స్పందించారు. ఇప్పటి వరకు 90.1 మిలియన్ వ్యూస్ వచ్చాయి. 56 లక్షలకుపైగా మంది ఓట్లు వేశారు. 80.4 శాతం మంది అమెరికాలో కొత్త పార్టీ అవసరం ఉందని, 19.6 శాతం మంది అవసరం లేదని ఓటు వేశారు. పోల్ తుది ఫలితాలపై శనివారం మస్క్ ఓ పోస్టు పెట్టారు.


‘మధ్యలో ఉన్న 80 శాతం మంది కోసం అమెరికాలో ఓ కొత్త పార్టీ పెట్టడానికి ఇది సరైన సమయమేనా? అన్న దానిపై ప్రజలు స్పందించారు. దీనికి 80 శాతం మంది సానుకూలంగా స్పందించారు. ఇది విధి’ అని పేర్కొన్నారు. అనంతరం మరో పోస్టులో కొత్త పార్టీ పేరు అనౌన్స్ చేశారు. ‘ది అమెరికా పార్టీ’ అని తెలియజేశారు. మస్క్ కొత్త పార్టీ ప్రకటన ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇది నిజంగా ట్రంప్‌కు భారీ దెబ్బ అని చెప్పాలి. గత కొన్నేళ్ల నుంచి మస్క్ అన్ని రకాలుగా ట్రంప్‌కు మద్దతుగా నిలుస్తూ వచ్చారు. ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ గెలుపుకు ఎంతో కష్టపడ్డారు. ఇద్దరి మధ్యా గొడవతో రిపబ్లిక్ పార్టీకి కూడా నష్టం జరగనుంది.


ఇవి కూడా చదవండి

500 నోట్లు కూడా రద్దేనా..? ఆర్బీఐ ఏం చెబుతోందంటే..

జంతు ప్రపంచంలో బెస్ట్ నాన్నలు ఇవే

Updated Date - Jun 07 , 2025 | 11:23 AM