Share News

Mother Sentenced to Life: ఈమె అసలు తల్లేనా.. కన్న కూతురని కూడా చూడకుండా ఏళ్ల తరబడి పస్తులు ఉంచి.. చివరకు..

ABN , Publish Date - Jan 25 , 2025 | 11:00 PM

ఓ మహిళ తన బిడ్డ పాలిట మృత్యువుగా మారింది. చిన్నారిని వారాల పాటు పస్తులు ఉంచి మరణించేలా చేసింది. ఈ కేసులో నిందితురాలికి తాజాగా యావజ్జీవ కారాగార శిక్ష ఖరారైంది.

Mother Sentenced to Life: ఈమె అసలు తల్లేనా.. కన్న కూతురని కూడా చూడకుండా ఏళ్ల తరబడి పస్తులు ఉంచి.. చివరకు..

ఇంటర్నెట్ డెస్క్: కన్నతల్లి అంటే కడుపున పుట్టిన బిడ్డల్ని ప్రాణంకంటే మిన్నగా చూసుకుంటుందని భావిస్తారు. కానీ ఓ మహిళ తన బిడ్డనే బలితీసుకుంది. చివరకు జైలు పాలైంది. మాతృత్వానికి మచ్చ తెచ్చేలా తన కూతురిని పస్తులు ఉంచి చంపేసిన ఫ్రాన్స్ మహిళ శాండ్రీన్ పిసారాకు (54) ఫ్రాన్స్ న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 20 ఏళ్ల శిక్ష పూర్తయ్యే వరకూ పెరోల్ అవకాశం కూడా ఉండదని స్పష్టం చేసింది. ఈ కేసులో ఆమె మాజీ భాగస్వామి జీన్ మిషెల్ క్రాస్‌కు 20 ఏళ్ల కారాగార శిక్ష విధించింది (France).

శాండ్రీన్ కూతురు 2020 ఆగస్టు 6న 13 ఏళ్ల వయసులో కన్నుమూసింది. అప్పటికి ఆమె బరువు కేవలం 25 కిలోలు. ఎత్తు ఐదు అడుగులు. బాగా బరువు తగ్గడం, కండరాలు క్షీణించడంతో పాటు రక్తంలో ఇన్‌ఫెక్షన్ చేరడంతో ఆమె మృత్యువాత పడ్డట్టు పోస్టు మార్టం నివేదికలో తేలింది. ఆమె పళ్లు కూడా కోల్పోయిందని, జుట్టు ఉడిపోయిందని కూడా తేలింది.


Mass deportation in US: అమెరికాలో మొదలైన ట్రంప్ ఆపరేషన్.. అక్రమ వలసదారుల అరెస్ట్..

అమాన్‌డిన్‌పై ఆమె తల్లి చాలా చిన్నతనం నుంచే వేధింపులకు గురి చేసినట్టు ప్రాసిక్యుటర్లు తెలిపారు. ఆమె ముఖంపై పిడిగుద్దులు, తన్నులు, జుట్టు లాగడం వంటి చర్యలకు ఆమె తల్లి పాల్పడేదని అన్నారు. కూతురి విషయంలో తండ్రి కూడా నిర్లక్ష్యం ప్రదర్శించాడని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జ్యూరీ కలిసి నిందితులకు ఈ మేరకు శిక్ష ఖరారు చేసింది.


ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ ఆమె నిందితురాలిని డిక్టేటర్ అని వ్యాఖ్యానించారు. ఇలాంటి వారికి యావజ్జీవ కారాగార శిక్ష మినహా మరో శిక్ష ఏదీ లేదని స్పష్టం చేశారు.

Citizenship Law : ఆపరేషన్‌ చేయించుకుని అయినా సరే.. ఆలోగా కనేద్దాం!

అయితే నిందితురాలు మాత్రం తన బిడ్డను క్షమాపణలు కోరుతున్నట్టు ఓ ప్రకటన విడుదల చేశారు. అంతకు మించి ఈ ఉదంతంలో తాను చెప్పదలుచుకున్నదేమీ లేదని పేర్కొన్నారు.

Read Latest and International News

Updated Date - Jan 25 , 2025 | 11:00 PM