Share News

Elon Musk: స్పేస్‌ ఎక్స్‌ స్టార్‌షి్‌పలో పేలుడు

ABN , Publish Date - Jun 20 , 2025 | 04:34 AM

ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది.

Elon Musk: స్పేస్‌ ఎక్స్‌ స్టార్‌షి్‌పలో పేలుడు

టెక్సాస్‌, జూన్‌ 19: ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. టెక్సా్‌సలో నిలిపి ఉన్న స్టార్‌షిప్‌ వాహనం ఇంజన్‌కు బుధవారం రొటీన్‌గా తనిఖీలు చేస్తుండగా అది పేలింది. తనిఖీల్లో భాగంగా ఎప్పుడూ జరిపే ఫైర్‌ టెస్ట్‌ను నిర్వహించగా అనూహ్యంగా ఇంజన్‌ పేలింది. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇందుకుగల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

Updated Date - Jun 20 , 2025 | 04:34 AM