Share News

Donald Trump: ట్రంప్‌ సుంకాలపై ఈయూ కన్నెర్ర

ABN , Publish Date - Mar 13 , 2025 | 06:04 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్టీల్‌, అల్యూమినియంపై విధించిన సుంకాలపై యూరోపియన్‌ యూనియన్‌ కన్నెర్ర చేసింది. అమెరికాకు చెందిన 28.33 బిలియన్‌ డాలర్ల వస్తువులపై ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించింది.

Donald Trump: ట్రంప్‌ సుంకాలపై ఈయూ కన్నెర్ర

ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటన... ‘కెనడాపై డబుల్‌ టారిఫ్‌’పై ట్రంప్‌ యూటర్న్‌

బ్రస్సెల్స్‌, మార్చి12: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్టీల్‌, అల్యూమినియంపై విధించిన సుంకాలపై యూరోపియన్‌ యూనియన్‌ కన్నెర్ర చేసింది. అమెరికాకు చెందిన 28.33 బిలియన్‌ డాలర్ల వస్తువులపై ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా ఉత్పత్తులపై ఉన్న టారి్‌ఫల సస్పెన్షన్‌ను ఏప్రిల్‌ ఒకటి నుంచి తొలగిస్తున్నట్లు ఈయూ కమిషన్‌ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌డెర్‌ తెలిపారు. సుంకాల వల్ల అమెరికా, యూర్‌పలో ధరలు పెరిగిపోతాయని, వినియోగదారులను, వ్యాపారులను కాపాడేందుకు ఈయూ చర్యలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు, కెనడాకు చెందిన ఉక్కు, అల్యూమినియంపై 50ు టారిఫ్‌ విధిస్తామని ప్రకటించిన ట్రంప్‌ యూ టర్న్‌ తీసుకున్నారు. తొలుత ట్రంప్‌ 25 శాతం టారిఫ్‌ విధించడంతో అమెరికాలోని మూడు రాష్ట్రాలకు సరఫరా చేసే విద్యుత్‌పై ఎగుమతి సుంకాలను 25ు పెంచుతున్నట్లు కెనడాలోని ఒంటారియో ప్రకటించింది. దీనికి ప్రతీకారంగా 50ు సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. అయితే అమెరికా వాణిజ్య కార్యదర్శి లుట్నిక్‌ జరిపిన చర్చలు ఫలించడంతో విద్యుత్‌పై 25ు అదనపు రుసుం వసూలు చేయాలనే ప్రణాళిక విరమించుకున్నట్లు ఒంటారియో ప్రకటించింది. దీంతో ట్రంప్‌ కూడా వెనక్కి తగ్గారు.


అమెరికా ఆల్కహాల్‌పై భారత్‌ 150% సుంకం

అమెరికా ఆల్కహాల్‌ సహా కొన్ని ఉత్పత్తులపై భారత్‌ 150ు సుంకాలు విధిస్తోందని వైట్‌హౌస్‌ మీడియా కార్యదర్శి కరోలిన్‌ లివిట్‌ చెప్పారు. వ్యవసాయ ఉత్పత్తులపైనా భారత్‌ వంద శాతం సుంకాలు విధిస్తోందని, అందుకే ట్రంప్‌ పరస్పర సుంకాలను విధించాలని చూస్తున్నారని తెలిపారు. ఏప్రిల్‌ 2 నుంచి భారత్‌పై ప్రతీకార టారి్‌ఫలు విధిస్తామని ట్రంప్‌ ఇటీవలే ప్రకటించారు.


టెస్లా కారును కొనుగోలు చేసిన ట్రంప్‌

ఎలాన్‌ మస్క్‌కు చెందిన టెస్లా సంస్థ కారును ట్రంప్‌ కొనుగోలు చేశారు. మస్క్‌ నేతృత్వంలోని డోజ్‌ శాఖ ప్రభుత్వ ఉద్యోగుల అంశంలో తీసుకుంటున్న నిర్ణయాలపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఫలితంగా టెస్లా కంపెనీ షేర్ల విలువలు భారీగా పతనమయ్యాయి. టెస్లా కార్లు కొనుగోలు చేయవద్దు అనే ప్రచారమూ అధికమైంది. ఈ నేపథ్యంలో టెస్లాకు మద్దతుగా ఆ సంస్థకు చెందిన కారును కొనుగోలు చేశారు. టెస్లాకు చెందిన ఐదు రకాల కార్లను మస్క్‌ ఏకంగా వైట్‌హౌ్‌సకు తీసుకొచ్చి ట్రంప్‌ వాకిట్లో పెట్టారు. వాటిల్లో నుంచి ఓ ఎరుపు రంగు కారును ఎంపిక చేసుకున్న ట్రంప్‌ దాదాపు 80వేల డాలర్ల(దాదాపు రూ.70లక్షలు) కు ఆ వాహనాన్ని కొనుగోలు చేశారు.

Updated Date - Mar 13 , 2025 | 06:04 AM