Share News

Elon Musk: ట్రంప్ విధానాలపై ఎలన్ మస్క్ విమర్శలు.. తొలిసారి వ్యతిరేక గళం..

ABN , Publish Date - May 28 , 2025 | 09:39 PM

గతేడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలవడం వెనుక ప్రపంచ కుభేరుడు, టెస్లా సంస్థ అధినేత ఎలన్ మస్క్ గణనీయమైన పాత్ర పోషించారు. భారీగా నిధులు సమకూర్చిపెట్టారు. ప్రచార బాధ్యతలను కూడా పర్యవేక్షించారు.

Elon Musk: ట్రంప్ విధానాలపై ఎలన్ మస్క్ విమర్శలు.. తొలిసారి వ్యతిరేక గళం..
Elon Musk

గతేడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) గెలవడం వెనుక ప్రపంచ కుభేరుడు, టెస్లా సంస్థ అధినేత ఎలన్ మస్క్ (Elon Musk) గణనీయమైన పాత్ర పోషించారు. భారీగా నిధులు సమకూర్చిపెట్టారు. ప్రచార బాధ్యతలను కూడా పర్యవేక్షించారు. అందుకు ప్రతిగా ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత మస్క్‌కు ప్రభుత్వంలో కీలక పాత్ర అప్పగించారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (Doze) శాఖను అప్పగించారు. ఈ శాఖ ప్రభుత్వ వ్యయాలను తగ్గించడంలో సహాయపడుతుంది (USA News).


మస్క్ డోజ్ శాఖ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చాలా కోతలు విధించి నిధులను మిగిల్చారు. అయితే అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల ఓ బిల్లుకు రూపకల్పన చేశారు. దానికి భారీగా నిధులు కావాల్సి ఉంది. ఆ బిల్లు కారణంగా అమెరికాలో ద్రవ్యలోటు పెరుగుతుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాలో పెట్టుబడులు పెడుతున్న మదుపర్లు భయాందోళనలు వ్యక్తం చేశారు. దీంతో ఎలన్ మస్క్ ఆ బిల్లుపై అసహనం వ్యక్తం చేశారు. ఈ బిల్లుపై వ్యతిరేక గళం వినిపించారు.


ఈ బిల్లుకు అధిక బడ్జెట్ కేటాయించాల్సి రావడం వల్ల, ద్రవ్యలోటు పెరుగుతుందని, ప్రభుత్వ ఖర్చులు తగ్గించాలనే డోజ్ ఆశయాలకు ఆ బిల్లు గండి కొడుతుందని మస్క్ అన్నారు. ఇప్పటివరకు ప్రభుత్వ వ్యయాలను తగ్గించడానికి డోజ్ చేసుకున్న చర్యలు ఈ నిర్ణయంతో వృథా అయిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి..

ఫ్రాన్స్ అధ్యక్షుడిని కొట్టిన భార్య? వైరల్ అవుతున్న వీడియో చూస్తే

ఆ దేశానికి యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ ఆఫర్

మరిన్ని అంతర్జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 28 , 2025 | 09:39 PM